సెప్టెంబర్17ను రాజకీయం చేస్తున్న బీజేపీ, టీఆరెస్ పార్టీలు

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్ రెడ్డి
 నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్ 17,జనంసాక్షి,,  తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం నిర్మల్ లో జాతీయ జెండాను ను ఆవిష్కరించిన ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆనాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి స్మరించుకుంటూ నివాళుర్పిచారు.ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. బీజీపీ, టీఆర్ఎస్ నేతలు కుటిల రాజకీయ చేస్తున్నారని ధ్వజమెత్తారు.దేశ స్వాతంత్రం కోసం, తెలంగాణ స్వాతంత్రం కోసం బీజీపీ పోరాటం చేయలేదని అన్నారు.సెప్టెంబర్ 17 ను రాజకీయాల కోసం  బీజేపీ, టిఆర్ ఎస్ లు వాడుకుంటున్నాయని ధ్వజమెత్తారుఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఏ రోజు సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహించలేదని బీజేపీ చేస్తుందని ఈరోజు దొంగనాటకం అడుతుందని ఆరోపించారు,
సెప్టెంబర్ 17 విషయంలో బీజీపీ, టీఆర్ఎస్ నేతల తీరు ఊరు ఒకడిది పేరు ఒకడిగా ఉందన్నట్లు గా వుందని అన్నారు,దేశ స్వాతంత్య్రం కోసం,  ఆనాడు తెలంగాణ ను భారత్ లో అంతర్భగం చేయడంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వుందని అన్నారు,తెలంగాణ పై ఇంత ప్రేమ చూపిస్తున్న కేంద్రం లోని బీజీపీ సర్కారు,గోవా లిబరేషన్‌ డేకు 300 కోట్లు ఇచ్చిందని, మరి తెలంగాణ లిబరేషన్ డే కు ఎందుకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్కల రమణ రెడ్డి,ముత్యంరెడ్డి,,నాందేదపు చిన్నూ,అజర్,ఇమ్రాన్ ఉల్లాఖాన, కూన శివకుమార్, జమాల్,తదితరులు పాల్గొన్నారు