సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చేర్యాల పోలీస్ వారి ఆధ్వర్యంలో అవగాహన
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 10 : చేర్యాల మండలంలోని కడివేరుగు గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామ ప్రజలకు యువతకు చైతన్యం కలిగించే అవగాహన కార్యక్రమం చేపట్టారు. చేర్యాల ఎస్ఐ భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్ఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆన్లైన్ మోసాలు, గూగుల్ పే, ఫోన్ పే లలో లింకులు పంపి డబ్బును లాక్కునే విధంగా, ఓటిపిల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ నేరాగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Attachments area