*సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (07):* మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర పాఠశాలలో బుధవారం స్థానిక ఎస్సై నవీద్ సైబర్ నేరాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పైన అప్రమత్తంగా ఉండాలని ఆన్లైన్ మోసాలకు పాల్పడకుండా విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు అనవసరమైన యాప్ ల ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్లు మన అకౌంట్లో ఉన్న డబ్బుల ను సైబర్ నేరగాళ్ల అకౌంట్ లోకి నేరుగా వెళ్లే అవకాశం ఉందన్నారు గుర్తుతెలియని వ్యక్తుల కు ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్, లను చెప్పకూడదన్నారు ఒకవేళ ఎవరైనా అడిగితే మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు