సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

నల్లబెల్లి జులై 22 (జనం సాక్షి):
మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నర్సంపేట సీఐ సూర్యప్రకాష్, స్థానిక ఎస్సై రాజారాం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై  విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆన్ లైన్
మోసాలు ఎక్కువ జరుగుతున్నందున వారి బారిన పడకుండా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తగిన జాగ్రత్తలను తెలియజేశారు. బాల్య వివాహాలు   జరుగుతున్నాయని వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించి బాల్య వివాహాలు చేసుకోవద్దని తెలిపారు. ఆన్ లైన్ లో ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తగిన సలహాలు సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.