సొనాల ను మండలంగా ప్రకటించడండి
బోథ్ (జనంసాక్షి) గతంలో కే సీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోనాల ను మండలంగా ప్రకటించాలని బోథ్ ఎంపిపి తుల శ్రీనివాస్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్ లో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంట వివరాలను. గ్రామాల పరిస్థితి ని మంత్రికి నీవరించి ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తప్పక ఆదుకుంటామని హామీ ఇచ్చారని ఎంపిపి తెలిపారు.