సోనియా ఇంటి ఎదుట సిక్కుల ఆందోళన

  న్యూఢిల్లీ, మే 2 (జనంసాక్షి): సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న సిక్కులు తమ ఆందోళనను మరింత ఉధృతం  చేశారు. గురు వారం ఉదయం సోనియాగాంధీ నివాసం ఎదుట నిరసనకు దిగిన సిక్కులు ఏకంగా టెన్‌ జన్‌పథ్‌ లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిం చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన సిక్కులు బారికేడ్లు ఎక్కి లోనికి వెళ్ళేందుకు విశ్వప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేయాలని మహిళలు ఆవేదన వ్యక్తంచే శారు. సజ్జన్‌కు ఉరిశిక్ష విధించాలంటూ నినాదాలతో జన్‌పథ్‌ ప్రాంతం          మిగతా 2లో దద్దరిల్లింది. అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను తగులపెట్టిన ఆందోళనకారులను పోలీసులు అక్కడినుంచి చెదరగొట్టారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన దాడి కేసులో సజ్జన్‌ కుమార్‌ నిందితుడు. ఇటీవల ఢిల్లీ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ కేసులో ఉన్న మరో ఐదుగురికి శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే.