స్కేటింగ్ లో గీతం విద్యార్థినికి బంగారు పథకం
పటాన్చెరు అక్టోబర్ 20 (జనం సాక్షి)
గీతం విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన జాతీయ పోటీలలో రాణించి రోలర్స్ స్కేటింగ్ పథకాలు సాధించినట్లు క్రీడల సంచాలకుడు అరుణ్ కార్తీక్ తెలిపారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యూమనిటిస్ మరియు సోషల్ స్పెన్సర్స్ లో బిఎ సైకాలజీ రెండో ఏడాది విద్యార్థిని రియా సాబు క్వాడ్ ఫ్రీ స్టైల్
స్కేటింగ్ ఈవెంట్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని బంగారు పథకాన్ని గెలుచుకున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన గీతం విశాఖపట్నంలోని బీటెక్ విద్యార్థిని అన్మిషా భూపతి రాజు ఇదే పోటీలలో కాంస్య పతకాన్ని సాధించినట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీలలో రాణించి పథకాలను కైవసం చేసుకున్న గీతం విద్యార్థులు ఇద్దరిని గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానం, డి ఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ వర్మ తదితరులు అభినందించినట్లు పేర్కొన్నారు.