*స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి*. *రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి బాల్ రెడ్డి*.
వీపనగండ్ల16(జనంసాక్షి ) తెలంగాణ రైతు సంఘం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐఓబి బ్యాంకు ముందు పంట రుణాలు ఇవ్వాలని ధర్నాచేసి, డిప్యూటీ మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా *తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి బాల్ రెడ్డి మాట్లాడుతూ* రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పంట రుణాలు వానకాలానికి రూ, 51 230 కోట్లు. యాసంగికి రూ,34154 కోట్లు.మొత్తం కలిపి 85383 కోట్లు ప్రకటించింది కానీ ఆచరణలో రైతులకు రుణాల పంపిణీ ఇప్పటికీ జరగలేదు.పైగా పాత బకాయిల కింద రైతుబంధు ధాన్యపు డబ్బులు జమ చేసుకుంటున్నారు దీనివల్ల రైతులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.కాబట్టి స్పష్టమైన రుణ ప్రణాళిక విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ చెయ్యాలని,లేదా ప్రభుత్వ ఖాతాలో వేసుకోవాలన్నారు. రైతుబంధు, ధాన్యపు అమ్ముకున్న డబ్బులు రైతులకు వెంటనే ఇవ్వాలని. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని,రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ జిల్లా బ్యాంకర్ల కమిటీలో రైతు ప్రతినిధులు నియమించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వడ్డీ మాఫీ పథకాలకు సక్రమంగా అమలు చేయాలని,కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి బాల్ రెడ్డి, మండల కార్యదర్శి మహబూబ్ పాషా, కెవిపిఎస్ మండల కార్యదర్శి మురళి, నాయకులు రాములు, వెంకటయ్య, వెంకటస్వామి, ఉషన్, రామన్ గౌడ్, దయ్యపు వెంకటేష్, నాగరాజు, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.