స్థానికేతర నాయకత్వంతోనే స్థానిక గిరిజనులపై దాడులు..!

-ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ నాయక్
ఖానాపూర్ జూలై 20(జనంసాక్షి):స్థానికేతర నాయకత్వంతోనే ఖానాపూర్ నియోజకవర్గంలో స్థానిక గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
కిషోర్ నాయక్  అన్నారు. బుదవారం పెంబి మండల ఎంపిపి భర్తపై పస్పుల బ్రిడ్జి కాంట్రాక్టర్ పెట్టిన  కేసుకు వ్యతిరేకంగా బుదవారం పెంబి మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో  గిరిజన,ఆదివాసీ  నాయకులు యువజన సంఘల నాయకులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
కిషోర్ నాయక్ మాట్లడుతూ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వలస వచ్చి గిరిజన ,ఆదివాసీల పై పెత్తనం చెలాయిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే  ఖానాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డు లో  తన పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఖానాపూర్ నియోజకవర్గనికి ఎమ్మెల్యే రేఖ నాయక్ లేక ఎమ్మెల్యే భర్తనో నియోజకవర్గ ప్రజలకు తెలియడం లేదని అన్నారు. ఎమ్మెల్యే భర్త బ్లాక్ మెయిల్లకు పాల్పడుకుంటు అన్ని శాఖల అధికారులను వేదిస్తూ, గిరిజన ఆదివాసీల ఉసురు పోసుకుంటున్నరని రాబోయే రోజుల్లో ఖానాపూర్ నియోజకవర్గం మొత్తంలో ప్రతి గిరిజన, ఆదివాసీల ఇంటింటికీ వెళ్లి వలస వాదుల నుంచి ఖానాపూర్ నియోజకవర్గానికి విముక్తి కలిగించుకుందామని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో అయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.