స్పాట్‌ ఫిక్సింగ్‌ వెనుక అండర్‌ గ్రౌండ్‌ మాఫియా

బెట్టింగ్‌ నిందితులకు బెయిల్‌ నిరాకరణ
విందూ, గురునాథ్‌కు బెయిల్‌
న్యూఢల్లీి/ముంబయి, జూన్‌ 4 (జనంసాక్షి) :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్పాట్‌ ఫిక్సింగ్‌ వెనుక అండర్‌ గ్రౌండ్‌ మాఫియా ప్రమేయమున్నట్లు ఢల్లీి పోలీసులు తెలిపారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, అతడి అనుచరుడు చోటా షకీల్‌ పెద్ద ఎత్తున మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వారు వెల్లడిరచారు. మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైం ఆక్ట్‌ (మైకా) కింద దావూద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌తో పాటు 26 మందిపై అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. వారిలో రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్లు శ్రీశాంత్‌, అజిత్‌ చండిలా, అంకిత్‌ చవాన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో గురునాథ్‌ మయ్యప్పన్‌, బాలీవుడ్‌ నటుడు విందూ దారాసింగ్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. దావూద్‌ గ్యాంగ్‌ దుబయి, కరాచీ కేంద్రంగా బెట్టింగ్‌ మాఫియాను నడిపారని, వీరిద్దరు బుకీలతో తరచూ టట్‌లో ఉండేవారని పోలీసులు తెలిపారు.
ఐపిఎల్‌-6ల స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో నిందితులైన క్రికెటర్లు శ్రీశాంత్‌, చండీలాలకు ఢల్లీి కోర్టు బెయిల్‌ నిరాకరించింది. అంతేగాక వారు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లను తోసిపుచ్చింది. వారిద్దరికి జ్యూడిషియల్‌ కస్టడీ గడువును జూన్‌ 18వ తేదీ వరకు పొడిగించింది.
విందూ, గురునాథ్‌కు బెయిల్‌
ఐపీఎల్‌-6 బెట్టింగ్‌్‌ కేసులో నిందితులైన గురునాధ్‌ మయప్పన్‌, విందూ దారాసింగ్‌కు ముంబయి కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే మరో ఆరుగురు బుకీలకు కూడా బెయిలిచ్చారు. 25వేల రూపాయల పూచీకత్తుపై.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టులు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని కోరింది. వారానికి రెండుమార్లు విచారణ అధికారి ఎదుట స్వయంగా హాజరు కావాలని సూచించింది.