స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖాళీ చేయండి
గగన్‌నారంగ్‌కు
మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు
పుణెళి ,ఫిబ్రవరి 1 :మన దేశంలో క్రీడలకు , క్రీడాకారులకు ప్రోత్సాహం ఏ స్థాయిలో ఉందనేది మరోసారి రుజువైంది. యువక్రీడాకారులను పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే వారికి అన్నీ అడ్డుంకులే ఎదురవుతున్నాయి. తాజాగా ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన షూటర్ గగన్ నారంగ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పుణెళిలోని బలేవాడి కాంప్లెక్స్‌లో గగన్ ఒక అకాడవిూ నెలకొల్పాడు. గన్ ఫర్ గ్లోరీ పేరుతో యువషూటర్లకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయితే ఈ అకాడవిూ పెట్టుకున్న స్థలం అద్దెకు తీసుకున్నది కావడంతో కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఖాళీ చేయాలని నోటీసు వచ్చింది. లీజు కాంట్రాక్ట్ ముగిసిపోవడంతో మార్చి 31 లోగా కాంప్లెక్స్ ఖాళీ చేయాలన్నది ఆ నోటీసు సారాంశం. నిజానికి అకాడవిూ నెలకొల్పిన సమయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మహారాష్ట్ర క్రీడాశాఖ మంత్రి భాస్కర్ జాదవ్ హావిూ ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. కాంట్రాక్ట్ ప్రకారం గత ఏడాదితో లీజు ముగిసినప్పటకీ… పొడిగించాలంటూ గగన్ సంబంధిత అధికారులకు లేఖ రాశాడు. అప్పుడు వెంటనే స్పందించిన అధికారులు మరో ఐదేళ్ళ పాటు అకాడవిూ నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే తాజాగా మహారాష్ట్ర క్రీడాశాఖ మాత్రం అక్కడ అకాడవిూ కొనసాగించాలంటే అద్దె చెల్లించడంతో పాటు ఏడాదికి పదిశాతం చొప్పున పెంచాలని కూడా డిమాండ్ చేసింది. లేని పక్షంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖాళీ చేయొచ్చని సూచించింది. దీంతో క్రీడాశాఖ మంత్రి గతంలో ఇచ్చిన హావిూ గాలి మాటలేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తులో భారత్‌కు ఒలింపిక్స్ పతకాలు అందించే లక్ష్యంతో గగన్ నారంగ్ నెలకొల్పిన అకాడవిూకి ఇటువంటి పరిస్థితి ఎదురవడంపై క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.