స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

అశ్వారావుపేట, సెప్టెంబర్ 10( జనం సాక్షి)

అశ్వరావుపేట మండలం గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ పెద్దవాగు ప్రాజెక్టు లో ఉన్న గురుకుల డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమానికి ముఖ్యగా అతిధిగా పాల్గొన్న అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు మెచ్చా.నాగేశ్వరరావుఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురుకుల పాఠశాల ల ద్వారా ప్రతి పేద విద్యార్థికి మంచి విద్యా నాణ్యత గల ఆహారం అన్ని రకాల సదుపాయాలను ప్రతి ఒక్క పేదవారికి అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ఈ ఒక్క గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి సుమారు లక్ష రూపాయలు పైన తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 970 గురుకుల పాఠశాలలో కళాశాలలో వున్నాయని, ఈ కళాశాలలో పాఠశాలలో సుమారు 6 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని దీనివలన ప్రతి పేదవాడికి మంచి విద్యా అందుతుందని, ఈ కళాశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థులు శ్రద్ధతో క్రమశిక్షణతో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరాలని ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్త మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో, గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్క జిల్లాకు కూడా గురుకుల కళాశాలలు, ఏర్పాటు చేస్తారని, అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజీ ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు అనీ, కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకి, ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో “మన ఊరు మన బడి” కార్యక్రమం లో ప్రతి పాఠశాలను నూతన హంగులతో తీర్చి దిద్దుతున్నారు, ప్రతి పాటశాలలో తెలుగు తో పాటు ఆంగ్ల బోధన విధానాన్ని కూడా అమలు చేశారని, మంచి నీరు నాణ్యత గల ఆహారన్ని ఎర్పాటు చేశారని, గిరిజన బాల బాలికలకు, వసతి గృహంలు ఏర్పాటు, ఇలా ఎన్నో రకాలు గా పేద విద్యార్థులకి ఉచిత విద్య నాణ్యమైన విద్యను అందిస్తూన్న ఘనత మన ముఖ్యమంత్రి కేసిఆర్ అనీ ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి తెలిపారు. అనంతరం కళాశాలలోని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మరియు ప్రజా ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి జుజ్జురు వెంకన్న, ఎంపీటీసీ పద్ధం కుమారి, మల్లయ్య గూడెం సర్పంచ్ నారం రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, అరటికాయల రవి,భిర్రం వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ రోజా,మాజీ ఉప సర్పంచ్ చిచ్చుడి వెంకటేశ్వర రావు, రామినేని ప్రసాద్,నాయకులు కలపాల శీను, జక్కుల రాంబాబు,సంపూర్ణ, ఫణీంద్ర వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు