స్వరాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీదీ కీలక భూమిక
హైదరాబాద్(జనంసాక్షి):తొలి,మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరిం చుకున్నారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియా డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. నైజాం వ్యతిరేక పోరులో ఓ వైపు పాల్గొంటూనే, మరో వైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వందేమాతరం, క్విట్ ఇండియా ఉద్యమాల్లోనూ బాపూజీ భాగస్వామి అయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా వివిధ హోదాలలో ప్రజలకు సేవ చేయటంతో పాటు నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారని ముఖ్యమంత్రి తెలిపారు.