*స్వాతంత్ర్య వజ్రొత్సవాల్లో అందరు బాగస్వాములు కావాలి!

*ఎల్లమ్మ తాండ కార్యదర్శి ఫరిద
లింగంపేట్ 13 (జనంసాక్షి)
లింగంపేట్ మండలంలోని ఎల్లమ్మ తాండ గ్రామపంచాయతిలో గ్రామసర్పంచ్ బీంరావ్ ఆద్వార్యంలొ కార్యదర్శి ఫరీదబేగం స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా స్కూల్ విద్యార్థులతో త్రివర్ణ జెండాను పట్టుకొని స్కూల్ విద్యార్థులతో నినాదాలు చేయించారు.గ్రామపంచాయతీ కార్యదర్శి ఫరీదా బేగం మాట్లాడుతు స్వాతంత్ర వజ్రొత్సవ దినోత్సవంలో ప్రజలందరు బాగస్వాములు కావలన్నారు.స్వాతంత్ర వజ్రోత్సవ స్పూర్తిని ప్రజలకు తెలియజేశారు.ఈ నెల 15 స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహిస్తు 16 జాతీయ గీతంలో ఎవరు ఎక్కడ ఉన్నా సెల్యూట్ తో జాతీయ గీతం ఆలపింస్తు వజ్రోత్సవ సంబరాల్లో ప్రతి ఒక్కరు పాల్గోనాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ అంగన్వాడీ కార్యకర్త కవిత గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు