స్వైన్‌ ఫ్లూ పై సమిష్టి యుద్ధం

1

కదనానికి కదిలిన సర్కార్‌

ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రితో ఫోన్‌లో మంతనాలు

తక్షణ సహాయం కోసం వినతి

అధికారులు, కార్పొరేట్‌ ఆసుపత్రుల ఆధిపతులతో భేటీ

నివారణ చర్యలకు అధికారులకు ఆదేశాలు

స్వైన్‌ ప్లూ ఆరోగ్య శ్రీ పరిథిలోకి

సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): స్పైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలడంపై తక్షణ చర్యలకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. వ్యాధి నివారణకు సహకరించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. సమిష్టిగా వ్యాధిని పారద్రోలేందుకు రంగం సిద్ధమైంది. గతకొంత కాలంగా చాపకిందనీరులా వ్యాపించిన వ్యాధి ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే పలువురు మరణించగా మరికొందరు చికిత్స పొందుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖస్తబ్దుగా ఉండడం పట్ల సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో సీఎం ఫోన్లో స్పైన్‌ఫ్లూ పై చర్చించారు.  స్పైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రత పెరిగిపోతుండడంతో తక్షణం స్పందించాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కోరారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఫోన్లో నరేంద్రమోడీతో మాట్లాడారు. వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలన్న ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై ప్రధాన మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర బృందాన్ని పంపడంతో పాటు, రాష్టాన్రికి అవసరమైన సాయం అందించాడానికి ప్రధాని అంగీకరించారు. రాష్ట్రంలోని వైద్య అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్టాన్ని స్వైన్‌ ఫ్లూ పట్టి పీడిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్వైన్‌ ఫ్లూపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం సచివాలయంలో స్వైన్‌ ఫ్లూపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించాచారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ… స్వైన్‌ ఫ్లూపై వార్తకథనాలు విరివిగా వుస్తుంటే …. స్వైన్‌ ఫ్లూ రెండు మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా… కానీ పరిస్థితి వేరుగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా మాట్లాడారు. వెంటనే  వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై పరిస్థితిని సవిూక్షించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరో20రోటుల పాటు చలిగాలులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ప్రజలకు స్పైన్‌ఫ్లూ నిరోధక వ్యాక్సిన్‌ అందివ్వాలని సిఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.  స్పైన్‌ఫ్లూపై యుద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సిద్దం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో స్పైన్‌ఫ్లూ ప్రభావంపై కేంద్రానికి వివరించాడానికి   వైద్యశాఖ కార్యదర్శి సురేష్‌ చందా ఢిల్లీకి వెళ్ళారు.  ప్రత్యేక బృందం పంపే అంశంతో పాటు, ఇతర సాయం అందే విషయంలో సమన్వయం చేసి సహకరించాలని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలను సీఎం కోరారు. అందుకు వారిద్దరూ సానుకూలంగా స్పందించారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. కేంద్ర సహకారంతో స్వైన్‌ ఫ్లూను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు.  స్వైన్‌ఫ్లొ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.  వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రులతో కూడా సవిూక్షించారు. ఉదయంనుంచి అధికారులతో సవిూక్షలు నిర్వహించారు.  ఆరోగ్య శాఖ కార్యదర్శి డీఎంఈ, ఐపీఎం డైరెక్టర్‌తో పర్యవేక్షణ కమిటీ వేశారు.  జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లొ నివారణ మందులు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు.  స్వైన్‌ ప్లూ తీవ్రతను అరికట్టేందుకు పర్యవేక్షణ నిమిత్తం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్‌ అధికారి, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 5 జోన్లకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. గురువారం రాత్రికల్లా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో స్వైన్‌ ప్లూ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండి స్వైన్‌ ఫ్లూ  పరిస్థితిని సవిూక్షించాలని సూచించారు. సీఎస్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సవిూక్ష నిర్వహించాలని, ప్రతి జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో స్వైన్‌ ప్లూ మందులు అందుబాటులో ఉంచుతామని కేసీఆర్‌ చెప్పారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో యుద్ధప్రాతిపదికన పరిశుభ్రత కార్యక్రమాలు చేపడతామన్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారు వెంటనే డాక్టర్ని సంప్రదించాలని కేసీఆర్‌ సూచించారు. ఇకపై రోజూ జిల్లా వైద్యాధికారులతో సీఎస్‌ రాజీవ్‌ శర్మ సవిూక్షించనున్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పరి/-థసితి సవిూక్షించాలని సీఎం ఆదేశించారు.  ప్రతి జిల్లాలోనూ స్వైన్‌ఫ్లొ నిర్దారణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 5 జోన్లకు ప్రత్యేక అధికారులను ఏర్పాటుచేశారు.  పాఠశాలల్లో రెండు రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.  ఇదిలావుంటే ప్రజల్లో అవగాహన కల్పించడంలో లోపం జరిగిందని మంత్రి  రాజయ్య అంగీకరించారు. 12 వేల డోసుల స్వైన్‌ఫ్లొ నియంత్రణ మందు అందుబాటులో ఉందని, సాయంత్రానికి మరో 50 వేల డోసుల మందు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం  ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రోజుకు కనీసం 50 కేసులు నమోదవుతున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు 21 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లొ వల్ల ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. స్వైన్‌ఫ్లొతో నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. రోజుకు కనీసం 50 స్వైన్‌ఫ్లొ కేసులు నమోదవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా మరికొందరు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. స్వైన్‌ఫ్లొతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్‌లో ఎక్కువగా స్వైన్‌ఫ్లూ ప్రభావం ఉంది.