హరితహారం. ప్లాంటేషన్ పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
 ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. సూచనల మేరకు  హరితహారం  మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని , ప్లాంటేషన్ పనులు ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లోఎం పి డి ఓ. ఎంపీవో. ఏపీవో. టీ ఏ లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో  బృహత్ పల్లె ప్రకృతి వన్నం , మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై ఖచ్చితంగా నియామ నిభందనలు పాటించాలని కలెక్టర్ అన్నారు.నర్సరీలోని ప్రతి మొక్క ఉపయోగం లోకి రావాలని గృహాలలో పెట్టే మొక్కలు మాత్రమే గ్రహాలకు అందచేయాలని , పెద్ద పెద్ద మొక్కలు గృహాలలో స్థలం లేకా వాటిని దుర్వినియోగం చేస్తున్నారని కలెక్టర్ అన్నారు. మన జిల్లాలోని అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసిన సాగ్రిగేషన్ షెడ్ లలో తయారు చేసే ఎరువులు బాగా ఉప యోగాకరంగ ఉన్నాయని, మొక్కలు పెంపకం లో వీటిని ఉపయోగించుకోవాలని  కలెక్టర్ అన్నారు. పంచాయితీ సెక్రటరీలు అందరూ మంచిగా పని చేసి గ్రామ అభివృద్ది తోడ్పడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆమె అన్నారు. రోడ్లకు ఇరువైపుల నిభందనలు మేరకు మూడు వరుసలలో చెట్లు నాటాలని పథకాల అమలు పర్యవెక్షించేందుకు కేంద్ర బృందం అన్ని జిల్లాలు పర్యటిస్తూ నందున మన జిల్లాకు కూడా వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని , నర్సరీల్లో మొక్కలు మిగలకుండా అన్ని ఉపయోగాం లోకి రావాలని కలెక్టర్ అన్నారు.జిల్లాలో ప్రతి గ్రామ పంచాయితిలో నర్సిరిలు ఏర్పాటు చేసి హరితహారం లో మొక్కలు పంపిణీ చేసే విధంగా అన్ని రకాల మొక్కలు పెంచడం జరిగిందని ఎక్కడ మొక్కలు దుర్వినియోగం కాకుండా చూడాలని పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు.
సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ మల్టీ లేయర్ ప్లాంటేషన్ లో 5 లేదా 6 ఫిట్ల మొక్కలను ఉపయోగించుకోవాలని గృహాలకు , పాఠశాలకు రోడ్లకు ఇరువైపుల పూల మొక్కలు
నాటాలని జులై చివరి వరకు ఇచ్చిన టార్గెట్ నిభందనలు ప్రకారం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం పర్యటిస్తున్న0దున చెక్ లిస్ట్ తయారు చేసుకొని వాటిని అమలు చేయాలని గ్రామ స్థాయిలో శానిటేషన్ పై కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని అవి రాకుండా చూసుకోవాలని పంచాయితీ సెక్రటరీ లను ఆదేశించారు.
సమావేశంలోడి ఆర్ డి ఏ  పీడీ  మాట్లాడుతు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయితీ లో రిజిస్టర్ నిర్వహించాలని. పరిశీలనకు  వచ్చిన బృందానికి అన్ని వివరాలు చూపించాలని గ్రామ పంచాయితీలో మొక్కలు పంపిణీ చేసే వివారలు , నర్సిరిలోని  మొక్కలు వివరాలు సమానంగా ఉండాలని ఆయన అన్నారు.సమావేశానికి హాజరైన ఎంపీడీఓ  లకు , ఎంపీవో  లకు, ఏ పి ఓ  లకు, టీ ఏ , పంచాయితీ సెక్రటరీ లకు, పి పి టీ ద్వారా మొక్కల పెంపకం వాటికి వచ్చే తెగుల నివారణ ఇతర సంబంధిత అంశాలను వివరించారు ఈ సమావేశంలో డీపీవో  సునంద, అడిషనల్ డిఆర్డిఏ పీడీ  నాగి రెడ్డి, ఎంపిడిఓ లు , ఎంపీఓలు, ఏ పి ఓ లు, , పంచాయితి సెక్రటిరిలు , సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.