హరితహారం లక్ష్యాలను నిర్ణిత కాలంలో పూర్తి చేయాలి.

-కలెక్టర్ శశంక

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి)

జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన హరితహారం లక్ష్యాలను నిర్ణీత కాలంలో పూర్తి స్థాయిలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. సామవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో హరితహారం లక్ష్యాలు, సాదించిన పురోగతి, ప్రభుత్వ కార్యలయాలలో బయోమెట్రిక్ అమలు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ కార్యలయాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ విదానాన్ని తిరిగి వినియోగంలోకి తేవాలని అదేవిధంగా జిల్లా, మండల స్థాయి కార్యాలయాలలో సీసీటీవీ కెమెరాలను అందుబాటులో తేవాలని, తద్వారా వాస్తవాలను తెలుసుకోవడంతో పాటు పూర్తి భద్రత ఉంటుందని కలెక్టర్ అన్నారు. మరమ్మత్తులు అవసరమైనవాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలని రాత్రి సమయంలో కూడా అంతరాయం లేకుండా సీసీటీవీ కెమెరా పనిచేసే విధంగా తగు ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు. అదేవిదంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో త్రాగునీరు, మరుగుదొడ్లు, సరిపడా ఫర్నీచర్ తప్పనిసరిగా ఉండాలని ప్రధానంగా మహిళా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగు వసతులు ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.