హరిత హారంగా మన అడవులు
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం
అడవుల సంరక్షణకు సర్కారు ప్రాధాన్యత-సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అడవులను కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అటవీశాఖకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. శనివారం ఆయన దూలపల్లి ఫారెస్ట్ అకాడవిూలో అటవీశాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్టాన్న్రి హరితవనంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రిజర్వ్ ఫారెస్టుల మ్యాప్ తెప్పించుకుని పరిశీలించానని, రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గిందని అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ అనే మాట వింటేనే భయం వేస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు అడువుల పరిస్థితి గురించి తెలిపానని అన్నారు. గొత్తి, కోయల వల్ల అడవులకు నష్టం జరుగుతోందన్నారు. చాలా చోట్ల అడవులు అన్యాక్రాంతమయ్యాయి. అడవుల రక్షణ విషయంలో గత ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. అడవుల రక్షణ కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సవిూక్షించి కొత్త చట్టాలు తెస్తామని పేర్కొన్నారు. అడవుల నరికివేతకు సంబంధించి నమోదయ్యే కేసులను త్వరతగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అటవీ సిబ్బంది రక్షణకు సాయుధ పోలీసుల సహకారం అందిస్తామని, అదే విధంగా అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడవిూలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ లోగోను, డైరీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అటవీశాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని, అటవీశాఖ అధికారుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామి ఇచ్చారు. అటవీశాఖ అధికారులు ప్రమోషన్లు, ఇతర మౌలిక వసతులపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. తెలంగాణలో ప్రస్థుతం ఉన్న అడవుల శాతాన్ని 25 నుంచి 33 శాతానికి పెంచి దేశంలోనే అత్యధిక అటవీప్రాంతం ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అటవీ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని, వేతన సవరణ చేస్తామని, వాహన సౌకర్యాలు కల్పిస్తామని, పోలీసు భద్రత ఏర్పాటు చేస్తామని అన్నారు. అటవీ శాఖ అధికారుల సమస్యలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆక్రమణల పట్ల, కలప స్మగ్లర్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. విధి నిర్వహణలో ఇబ్బంధులు ఎదురైతే వెంఠనే రెంఢు డజన్ల మంది సాయుధ పోలీసులను గంఠలో అందుబాట్లో ఉంచుతామన్నారు. సామాజిక అడవుల పెంపకానికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. అటవీశాఖ అధికారులు సమస్యలపై తనకు లేఖరాయాలని సీఎం సూచించారు. సమావేశంలో అటవీశాఖ మంత్రి జోగురామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ బి.ఎల్.మిశ్రా, అకాడమీ డైరెక్టర్ రఘువీర్, అడిషనల్ డైరెక్టర్ పిసిసిఎఫ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహెందర్‌రెడ్డి, సీఎంఒ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.