హాస్టల్ డైలీ వైజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

   – సిఐటియు.
కరకగూడెం,ఆగస్టు(జనంసాక్షి): హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెను సిఐటియు మండల అధ్యక్షులు కొమరం కాంతారావు చిరుమల్ల ఆశ్రమ పాఠశాల ఎదుట ప్రారంభించరూ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న తొమ్మిది నెలల వేతనాల బకాయిలు విడుదల చేయాలని ఇదివరకే మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని చివరకు సమ్మె చేయడమే మార్గమని నిర్ణయించి ఈ సమ్మె జరుగుతుందని వారు తెలిపారు. కరోనకాలంలో అన్ని రంగాల వారికి వేతనాలు అందించినప్పటికీ హాస్టల్ వర్కర్స్ కు మాత్రమే ఏమిటి ఈ వివక్ష అని వారన్నారు .జీతాలు రాక కుటుంబాన్ని సాకలేక అప్పుల పాలై తమ కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి వస్తుందని పెరిగిన ధరలు కనుగుణంగా జీతాలు పెంచాలని ,అందరూ డిమాండ్ చేస్తుంటే కనీసం మేము చేసిన పనికి అయినా సక్రమంగా జీతాలు ఇవ్వాలని అడగటం తప్ప అని వారు విమర్శించారు .ఇప్పటికే 9 నెలల జీతం పెండింగ్లో ఉందని వాటిని విడుదల చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామని కనీసం స్పందించిన పరిస్థితి లేదని వారన్నారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరిని డైలీవేజ్ వర్కర్ గా విధుల్లోకి తీసుకోవాలని తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వర్కర్స్ కొమరం ముసలయ్య, పాపయ్య, చర్ప నరసింహారావు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు,చంద్రకళ, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.