హిటాచి కర్మాగారంలో అగ్నిప్రమాదం
ఢిల్లీ: అహ్మదాబాద్‌లోని హిటాచి కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కార్మగారం దాదాపు 70 శాతం తగలబడిపోయింది. ఢిల్లీకి వంద కి.మీ దూరంలో కరన్ నగర్‌లో ఉన్న ఈ పరిశ్రమలో ఈ రోజు ఉదయం సంభవించిన అగ్నిప్రమాదం వల్ల రూ. 100 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. ఆరు కి.మీ. దూరం వరకూ మంటలు కన్పించాయని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. వేరువేరు చోట్ల నుంచి 20 ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పేందుకు కృషిచేశారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.