హెచ్‌ఎంలుగా పది మందికి పదోన్నతి
శ్రీకాకుళం, జూలై 19 : విద్యాశాఖ పరిధిలో పది మంది స్కూల్ అసిసెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా విధ్యాశాఖ అధికారిని ఎస్.అరుణకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ ద్వారా పది మందికి పాఠశాలలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి బి.మల్లేశ్వరరావు, కార్యాలయ సహాయ సంచాలకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.