హైదరాబాద్‌ చేరుకున్న

..హైదరాబాద్‌, డిసెంబర్‌ 26 (జనంసాక్షి):

భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యే విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవ్నర్‌ నరసింహన్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రలు, నగర మేయర్‌ ఘన స్వాగతం పలికారు.   అక్కడి నుంచి సికింద్రాబాద్‌ పరిధిలోని బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ప్రణబ్‌ముఖర్జీ శీతకాల విడిది కోసం నగరానికి రావడం ఇదే మొదటిసారి. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సిద్ధమైంది. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన

భద్రతా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఇక్కడి నుంచే తిరుపతి, చెన్నయ్‌, ముంబయి నగరాలకు వెళ్లి రానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరి వెళతారు. 11 గంటలకు తిరుపతి చేరుకుంటారు. శ్రీ వేంకటేశ్వర ప్రాంగణానికి చేరుకుని నాల్గో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభిస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరుపతి విమానా శ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వస్తారు. శుక్రవారం ఉదయం చెన్నయ్‌కు బయల్దేరి వెళతారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం షోలాపూర్‌, పూణె, ముంబయి పర్యటనకు బయల్దేరి వెళతారు. తిరిగి ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. సోమవారం ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. జనవరి 1న మధ్యాహ్నం 2గంటల సమయంలో ఢిల్లీకి బయల్దేరి వెళతారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు..

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, బేగంపేట విమానాశ్రయం వద్ద గురువారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆ రోజు ఉదయం 9.15 గంటల నుంచి 10.05 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.35 నుంచి 6.25 గంటల  వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

రాష్ట్రపతి నిలయం-లోతుకుంట-విక్రమ్‌పురి-ప్లాజా చౌరస్తా, రసూల్‌పురా చౌరస్తా, బేగంపేట విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అలాగే అదే రోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం-రసూల్‌ పురా చౌరస్తా, ఎన్‌సిసి చౌరస్తా-సికింద్రాబాద్‌ క్లబ్‌ ఇన్‌గేట్‌-హనుమాన్‌ టెంపుల్‌-లోతుకుంట వై జంక్షన్‌-రాష్ట్రపతి నిలయం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

కాగా, రాష్ట్రపతి తన విడిదికి చేరుకునే సమయంలో కొందరు తెలంగాణ వాదులు ఆయన కాన్వాయిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తెలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పక్కకు తొలగించార