హైదరాబాద్‌ హైకోర్టు తెలంగాణకే

3

-తెలంగాణ భూభాగంలో ఏపీ కోర్టులు నిర్మించరాదు

– కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

-అప్పటి వరకు ఉమ్మడిగానే

హైదరాబాద్‌,మే1 (జనంసాక్షి):

ఉమ్మడి హైకోర్టు విభజన సందర్భంగా ప్రస్తుత హైకోర్టు తెలంగాణకే చెందుతుందని ఉన్నత న్యాయస్థానం విభజనపై హైకోర్టు తీర్పు వెలువరించింది. విభజన చట్టం ప్రకారం ఇక్కడ, ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని న్యాయస్థానం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రమే నిధులు మంజూరు చేయాలని న్యాయస్థానం పేర్కొంది. తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టుకు వీలు లేదని తెలిపింది. ఉన్నత న్యాయస్థానం విభజనపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆంధప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటుకు కేంద్రమే నిధులు మంజూరు చేయాలని ఆదేశించింది. విభజన చట్టం ప్రకారం ఇప్పుడు ఉన్న హైకోర్టు తెలంగాణదేనని కోర్టు తెలిపింది. ఆంధ్రా హైకోర్టు ఏర్పడేవరకు ఉమ్మడిగానే కొనసాగుతుందని కోర్టు తెలిపింది. ఆంధప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టు ఉమ్మడిగానే కొనసాగుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీలో హైకోర్టు నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని తేల్చి చెప్పింది. అయితే హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని స్పష్టం చేసింది.అలాగే ఉమ్మడి హైకోర్టును ఇప్పట్లో విభజించేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త భవనం నిర్మించిన తర్వాత మాత్రమే హైకోర్టును విభజించాలని తేల్చిచెప్పింది. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసుకునే అధికారం తెలంగాణ రాష్టాన్రికి లేదని కూడా న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. అవసరమైతే ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత బెంచీలు పెట్టుకోవచ్చని, అంతే తప్ప ఇప్పటికిప్పుడు కోర్టును విభజించడం మాత్రం కుదరదని హైకోర్టు చెప్పింది. ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి ప్రాంతంలో ఒక భవనాన్ని కూడా కేటాయించింది. కానీ అలా ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటుచేసుకునే హక్కు తెలంగాణకు లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. దాంతో తెలంగాణ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలినట్లయిందని న్యాయవాదులు అంటున్నారు. ఏపీ హైకోర్టు నిర్మాణానికి నిధులను కేంద్రమే భరించాలని కూడా హైకోర్టు తెలిపింది. తెలంగాణ భూభాగంలో ఆంధప్రదేశ్‌కు  హైకోర్టును నిర్మించడం సరికాదని స్పష్టం చేసింది. ఉమ్మడి హైకోర్టును రెండుగా విభజించాలని.. ఏపీ, తెలంగాణకు రెండు హైకోర్టులు ఉండాల్సిందేనని తెలంగాణ న్యాయవాదులు ఎప్పటి నుంచో ఆదోళన చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాక ముందు నుంచే దీని కోసం ఉద్యమాలు జరిగాయి. ఇక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆందోళనలు చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు హైకోర్టు విభజనపై తుది తీర్పు వెల్లడైంది. దాంతో ఈ ఆందోళనలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందనే భావిస్తున్నారు.