హైబీజ్ బిజినెస్ అవార్డు అందుకున్న డాక్టర్ అఖిల్ హెల్త్ సైన్స్
– అవార్డును బహూకరించిన మంత్రి శ్రీధర్ బాబు
– అఖిల్ హెల్త్ సైన్స్ సేవలు అభినందనీయం
హెల్త్ అండ్ వెల్నెస్ రంగం లో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ అఖిల్ హెల్త్ సైన్స్ వారిని ప్రతిష్టాత్మకమైన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుతో హైబీస్ సత్కరించింది.బుధవారం నోవాటెల్ హోటల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డు సెకండ్ ఎడిషన్ లో భాగంగా ఈ అవార్డును అందించారు.
రాష్ట్ర పారిశ్రామిక ఐటీ రంగ మంత్రి డి శ్రీధర్ బాబు చేతులమీదుగా డాక్టర్ అఖిల్ హెల్త్ సైన్సెస్ సీఈవో డాక్టర్ కావ్యా కొమ్ము అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో సుచిర్ ఇండియా గ్రూప్ సిఇవో లయన్ కిరణ్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ఎండి వేణు వినోద్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి , మహా న్యూస్ చైర్మన్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాము చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డ్ ను ఇచ్చిన్నందుకు కంపెనీ చైర్మన్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు ఆనందం వ్యక్తం చేసారు.
ఇంతటి గొప్ప అవార్డు ను ఇచ్చినందుకు హైబిజ్ టీవీ వారికి కృతజ్ఞతలు వ్యక్తం చేసారు.