హోదా హావిూతో కాంగ్రెస్‌కు పునరుజ్జీవనం
పావులు కదుపుతున్న ఉమెన్ చాందీ
ఆశలపల్లకిలో కాంగ్రెస్ మాజీలు
కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆలోచనలు
అమరావతి,జూలై13(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రత్యేక¬దా అంశమే ఆయుధమని భావించి పావులుకదిపిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జి, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పాతనేతలంతా మళ్లీ కదలి వస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతలో ఇంతకాలం అంటీముట్టనట్లుగా ఉన్న నేతలు ఒక్కక్కరుగానే పార్టీలో చేరేందుకు రంగం సిద్దంఅవుతోంది. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికరాంలోకి వస్తుందన్న భరోసా కలుగుతోంది. అందుకే రాష్ట్రంలో అధికరాంలోకి వచ్చినా రాకున్నా కేంద్రంలో అవకాశాలు ఉంటాయన్న భరోసాలో నేతుల ఉన్నారు. దీంతోరాష్ట్రంలో పార్టీకి తిరిగి జవసత్వాలు కల్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించేలా ఉమెన్ చాందీ దూసుకుని పోతున్నారు. తక్షణమే రంగంలోకి దిగిన ఆయన ఇప్పటికే పార్టీ నేతలు, ముఖ్యులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల బాధ్యులతో పలుపర్యాయాలు మాట్లాడారు. ప్రత్యేక ¬దా అంశమే కాంగ్రెస్‌కు సరైన ఆయుధమని చెప్పారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదన్న అంచనాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. గతంలో తెలుగుదేశం మైత్రి కారణంగా కొన్ని సీట్లు సాధించినా మళ్లీ అలాంటి అవకాశం లేదని, ప్రత్యేక¬దా హావిూని బిజెపి విస్మరించింది కనుక ప్రజలు ఓటేయరన్న ధీమాలో ఉన్నారు. వైసీపీ నుంచి ఎంపీలు గెలిచినా ఏవిూ సాధించలేరన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెబితే రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేందుకు, తద్వారా ఎపికి ప్రత్యేక ¬దా సాధించేందుకు అవకాశాలు ఉన్నాయన్న ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పటి కిప్పుడు లేకపోయినా కర్ణాటకలాంటి పరిస్థితులు ఏర్పడితే మనం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందన్న భావనలో ఉమెన్ చాందీ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రత్యేక ¬దా కోరుకుంటు న్నందున కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ చేసే మొదటి సంతకం దీనిపైనేనని చెబుతూ ప్రజల్లోకి వెళితే మంచి ఫలితం ఉంటుందన్నారు. ప్రజల్లో స్పందన వస్తే… పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లి అక్కడ ఇమడలేని వారు తిరిగి వస్తారని విశ్లేషించారు. ఇతర పార్టీలకు వెళ్లిన వారిని కలిసి.. వెనక్కి రావాలంటూ పిలవాలని సూచించారు. ఈ కోవలోనే ఆంధ్రాలో ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పార్టీలో ఒకప్పుడు
కీలకంగా వ్యవహరించిన నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులపై దృష్టి సారించింది. పార్టీకి దూరమైన ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్‌లపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. రాజీవ్‌గాంధీతో మరింత అనుబంధం ఉండేది. రాజీవ్ పర్యటనకు వస్తే అనువాదకుడిగా పనిచేసేవారు. ఏఐసీసీ అధ్యక్షురాలి ¬దాలో సోనియా కూడా ఉండవల్లిని సలహాలు అడిగేవారు. కాంగ్రెస్ పార్టీకి అంతటి కీలకమైన నేత కావడంతో ఉండవల్లిని తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆహ్వానం పంపారు. రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి కాంగ్రెస్‌ను సైతం తూర్పారబట్టారు. ఆ పార్టీకి రాజీనామా చేసి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరినా, ఎన్నికలలో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరతారని ఉండవల్లి అనుచరవర్గం భావించింది. అయితే ఇప్పటికీ అరుణ్‌కుమార్ జగన్ పార్టీలో చేరలేదు. అమలాపురం నుంచిరెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన జీవీ హర్షకుమార్ కాంగ్రెస్‌లో కీలక నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. హర్షకుమార్ కూడా రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్రలో చేరి.. లోక్‌సభకు పోటీచేసి ఘోర పరాజయం పొందారు. సమైక్యాంధ్ర పార్టీలో కొన్నాళ్లు ఉండవల్లితో కలిసి క్రియాశీలకపాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ నుంచి పిలుపురావడంతో హర్షకుమార్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హర్షకుమార్ కాంగ్రెస్ పునరాగమనం చేస్తారా? అన్నది చూడాలి. తునికి చెందిన రాజా అశోక్‌బాబు, పిఠాపురం నుంచి కొప్పన మోహనరావు, కాకినాడకు చెందిన ముత్తా గోపాలకృష్ణ.. ఇలా ప్రాంతాల వారీగా కాంగ్రెస్ మాజీలపై దృష్టిసారించారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు పాత నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే బాధ్యత తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రభావం లేకపోయినా కేంద్రంలో కాం/-గరెస్
అధికారంలోకి రాగలదన్న నమ్మకంలో నేతలు ఉన్నారు. అందుకే ఉమెన్ చాందీ పిలుపుతో నేతలు మళ్లీ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు సమాచారం.