హోరాహోరీగా సాగిన వాలీబాల్ ఛాంపియన్స్ ట్రోఫీ
జహీరాబాద్. అక్టోబర్ 11 (జనం సాక్షి ) గత రెండు రోజులగా సాగుతున్న వాలీబాల్ ఛాంపియన్ ట్రోఫీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి, మండల పరిధిలోని శేకపూర్ గ్రామంలో హాజరత్ శేక్ శహబోద్ధిన్ ఉర్స్ ను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వాలిబాల్ క్రీడా పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి, టౌర్నీని శేకపూర్ తండా సర్పంచ్ నాగు చవాన్, ఎంపిటిసి శెట్టి నర్సింలు జెండా ఊపి ప్రారంభించారు, టౌర్నీలో పాల్గొన్న జట్లకు, నిర్వాహకులకు అంజనీ చారిటేబుల్ ట్రస్ట్ అధినేత అంజయ్య యాదవ్ తమ ట్రస్ట్ తరపున డ్రెస్సులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా టౌర్నీని ఉద్దేశించి అంజనీ ట్రస్ట్ అధినేత అంజయ్య యాదవ్ మాట్లాడుతూ క్రీడల్లో గేలుపు ఓటములు సహజమని, క్రీడలతో మనసికొల్లసానికి దోహదం చేస్తాయని, క్రీడలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని, రాబోయే రోజుల్లో ఇలాంటి టౌర్నీలు మరిన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు, నేడు గెలిచిన వారు రాబోయే రోజుల్లో మరింత కసరత్తుతో ముందుకుపోవలని అంజయ్య యాదవ్ అన్నారు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖిజర్ యఫై మాట్లాడుతూ క్రీడలతో వ్యక్తుల మధ్య స్నేహాభావం పెంపొందుతుందని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమిని హుందాగా స్వీకరించిన వారే నిజమైన విజేతలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి శెట్టి నర్సింలు, సర్పంచ్ నాగు చవాన్, ఉప సర్పంచ్ మహేబూబ్ ఖాన్, బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు లతిఫ్ బి అజిమోద్దీన్, ఇస్మాయిల్, సద్దాం, అబ్దుల్లా సిద్దిఖీ, శ్రీనివాస్ యాదవ్, నర్సింలు యాదవ్, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, జైపాల్, ప్రవీణ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు…