అసంఘటిత రంగ కార్మికులకు ఈ శ్రమ్  కార్డులు అందజేత

స్టేషన్ ఘనపూర్, జూలై 16 , ( జనం సాక్షి) :
మండలం లోని తాటికొండ గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టినఅసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతతో పాటు, వివిధ సంక్షేమ పథకాలు పొందడానికి అవకాశం ఉన్నం దున వారి సంక్షేమం కొరకు వైస్ ఎంపిపి చల్లా సుధీర్ రెడ్డి తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి అసం ఘటితరంగ కార్మికులందరికీ ఈ- శ్రమ్‌ కార్డులను ఇప్పించడం జరుగుతుంది.  వైస్ ఎంపీపీ చల్లా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ-శ్రమ్‌ కార్డు వుంటే ప్రభుత్వం అందించే వివరాలు పొందుపరిచినప్రతి అసంఘటిత రంగ కార్మికునికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేస్తారని, అది ఉంటే ప్రభుత్వం అందించే అన్నిరకాల సామాజిక భధ్రత పథకాలు వివిధ సంక్షేమపథకాలు అందుతాయని అన్నారు. ప్రతీ కార్మికుడికి ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్ష భీమాయోజన (పీఎంఎస్‌బీవై)కింద ప్రమాదం జరిగి మరణించిన,అంగవైకల్యం కలిగి న 2 లక్షల ప్రమాదభీమా ఉచితంగా కల్పిస్తారని అన్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉన్న అసంఘటిత కార్మికులంతా వివరాలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, గ్రామ సిబ్బింది తదితరు లు పాల్గొన్నారు.