03పి,మొక్కలునాటుతున్న కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి

మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు రావాలి
… జిల్లా కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి
స్టేషన్ ఘనపూర్ , జూలై   , ( జనం సాక్షి ):
హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రజలందరు ముందుకు రావాలని జెడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి , జిల్లా కలెక్టర్ శివలింగయ్య అన్నారు.చిల్పుర్ మండలంలోని క్రిష్ణాజిగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరిత హరం కార్యక్రమంలో భాగంగా నేడు ఎక్సైజ్ శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన హరిత హరం కార్యక్రమాకి ముఖ్య అతిథులుగా జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి,జిల్లా కలెక్టర్ శివలింగ య్య హాజరై మొక్కలు నాటారు.అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావే శంలో పాల్గొని మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి ఒక్కరూమొక్కలునాటిహరితహారంకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజనిదేవి రవీందర్ రెడ్డి, యంపిటిసి నర్సింహులు, అదనపు కలెక్టర్ హమీద్, జెడ్పీ సిఇఓ విజయలక్ష్మి, డిఆర్ డిఓ రాంరెడ్డి, ఎక్సైజ్ సుపర్డెంట్ కృష్ణా ప్రియ, అసి స్టెంట్ సుపర్డెంట్ ప్రవీణ్, ఎంపీడీవో వేణు గోపాల్ రెడ్డి, తాసిల్దార్ విమల ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, గౌడ సంఘం కులస్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.