10న హస్తినకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈనెల 10న ఢిల్లీకి బాటపట్టనున్నారు. ఇవాళ వారు తెలంగాణ అంశంపై చర్చించేందుకు సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు ఢిల్లీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మినహా మరో ప్రత్యామయంలేదని, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత నేతలంతా ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. ఈ తీర్మాణ ప్రతిని ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ మంత్రి జానారెడ్డి అధిష్ఠానానికి అందజేయనున్నారు.