10 దాటినా పాఠశాలకు పత్తలేని ఉపాద్యాయులు

రాజాపూర్ మండలం సింగమ్మగూడ తాండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శ్రీనివాస్, కృష్ణయ్య మంగళవారం ఉదయం 10.05 గంటల సమయం దాటినా పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే ఉపాధ్యాయుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఉదయం 9.30 గంటలకు పాఠశాల ప్రారంభం కావాల్సి ఉండగా..

సమయం పది దాటినా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే నిరీక్షించారు.

పది గంటల ఐదు నిమిషాలకు పాఠశాలకు చేరుకున్న శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడిని పాఠశాలకు లేటుగా వచ్చారు అని ప్రశ్నించగా ఈరోజు లేటు అయిందని, ఎప్పుడూ సమయానికే వస్తామని జవాబు ఇచ్చారు.
పాత్రికేయులు ప్రశ్నించడంతో కనీసం ప్రేయర్ కూడా నిర్వహించకుండానే విద్యార్థులను హడావిడిగా తరగతి గదిలో కూర్చోబెట్టారు.

ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలకు ప్రజల నుంచి ఆదరణ కరువై ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతుంటే వచ్చే ఆ కొద్ది మంది విద్యార్థులకు కూడా ఉన్న ఉపాధ్యాయులు ఈ విధంగా తరగతులకు నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా కొనసాగుతాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.