107 సర్వే నెంబర్ లోని ఇందిరమ్మ పట్టా లబ్ధిదారులకు న్యాయం చేయాలి
107 సర్వే నెంబర్ లోని ఇందిరమ్మ పట్టా లబ్ధిదారులకు న్యాయం చేయాలి నిరుపేద ఇందిరమ్మ పట్టా ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కలెక్టర్ వినతిపత్రం…
ప్రమోద్ కుమార్ టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిభువనగిరి టౌన్( జనం సాక్షి):–కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 107 సర్వేనెంబర్ హుస్సేనాబాదులో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ పట్టాలను అందజేసిన వారికి డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుదారులలో అవకాశం కల్పించాలని లబ్ధిదారులకు న్యాయం చేయాలని లబ్ధిదారుల ఆధ్వర్యంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గారిని కలవడం జరిగిందిఇటి సందర్భంగా ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో భువనగిరి పట్టణంలోని 107 సర్వే నెంబర్లు గల హుస్సేనాబాద్ ప్రాంతంలో చాలామంది నిరుపేద కుటుంబాలను ఇండ్లు లేనటువంటి వారిని గుర్తించి ఇందిరమ్మ పట్టాలను అందజేయడం జరిగిందని ఇప్పుడు బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధితులకు అక్కడ ఇస్తున్నటువంటి పట్టాలలో భాగంగా 107 సర్వే నెంబర్లు గతంలో ఇచ్చిన వారికి అన్యాయం జరిగే విధంగా జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భువనగిరి పట్టణంలో నిర్మించినటువంటి 44 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు వీరిని లబ్ధిదారులుగా గుర్తించాలని ప్రభుత్వ అధికారులు చేసినటువంటి సర్వేలో గతంలో మీ పేరు పైన పట్టా తీసుకున్నట్టు మీ ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందని ఇప్పుడు వారిని రిజెక్ట్ చేస్తున్నారని మొదట ప్రాధాన్యతగా ఇందిరమ్మ పట్టాలు ఇచ్చిన వారిని ఎంపిక చేయాలని లేని పక్షంలో వీరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కేటాయించాలని అదేవిధంగా భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పేద ప్రజలు ఇండ్ల కిరాయిలు కట్టలేక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ప్రతి వార్డుకు 150 ఇండ్ల చొప్పున పేదలకు ఇండ్లను ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో పిట్టల బాలరాజ్ 26వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నరసింహ 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అమానత్ ఇందిరమ్మ పట్టా లబ్ధిదారులు పాల్గొన్నారు.