11 గ్రామాలకు ఆసరా పెన్షన్ షాది ముబారక్ కళ్యాణి లక్ష్మి 1.43.16.588 విలువగల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జాజాల సురేందర్

గాంధారి జనంసాక్షి ఆగస్టు 29
 ఈరోజు గాంధారి మండలం  గౌరారం గ్రామంలో సోమవారం గట్టుకింద 11గ్రామాలకు ప్రభుత్వ పథకాలు పోతాంగల్ కాలన్, గాంధారి, నేరల్, గుర్జాల్ గ్రామాలాల చుట్టూ పక్కల గ్రామాలలో పర్యటించి 143 మందికి కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ రూ.1,43,16,588/- విలువ గల చెక్కుతో పాటు తన సొంత ఖర్చులతో కిట్టు(పట్టు చీర)ను లబ్ధిదారులకు పంపిణి చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  జాజాల సురేందర్
వారితో పాటు తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ ఛైర్మన్  మర గంగారెడ్డి , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి  పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ
కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ దేశానికి ఆదర్శం
 మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కాబట్టే సంక్షేమ ఫలాలు పేదలకు దక్కుతున్నాయి
కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్, 24గంటల ఉచిత కరెంటు, రైతుబందు, దళితబందు కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ఎన్నో
మోడీ పాలించిన గుజరాత్లో, బిజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు
బిడ్డ పెండ్లీ కోసం ఆస్థులమ్ముకున్న గతం తెలంగాణది*
 తెలంగాణ ఆడబిడ్డలు మన ఆస్థి. వారి పెండ్లి మొదలు కాన్పు, చదువులు బ్రహ్మండంగా చూస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చెయ్యని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది అని అన్నారు
 అన్ని వర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడలేని పథకాలను అమలు చేసిన ఏకైక రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు
ఈ కార్యక్రమంలో  ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్దీదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు