ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌కు కట్టుబడ్డాం

COVER 23

తమిళనాడులో మొత్తం రిజర్వేషన్‌ 70శాతం

యూనివర్శిటీ విసిల నియామకాల్లో ప్రాధాన్యత

సెక్యూలర్‌ రాష్ట్రంగా తెలంగాణ : సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు స్పష్టంచేశారు. ఎన్నికల మేనిఫేస్టో తనకు భగవద్గీత అని ప్రకటించిన కెసిఆర్‌ ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అందులో భాగంగానే ముస్లిం రిజర్వేషన్‌పై ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన కేబినేట్‌ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌ హైటెక్స్‌లో ముస్లిం సోదరులకు ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో సీఎం పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్‌ అమలుకు త్వరలో జ్యుడీషియల్‌ కమిటీ వేస్తున్నట్లు, అలాగే సర్వీస్‌ కమిషన్‌ నియమాకాల్లో, మార్కెట్‌ కమిటీల్లో ముస్లింలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

మిళనాడులో 70 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్రంలో కూడా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను అనువర్తింపజేస్తామన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలలో వీసీల నియామకంలో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 16 నుంచి సౌదీ ఆరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వారానికి రెండుసార్లు విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించిన బిజ్‌ప్రోస్‌ సంస్థ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్లయాన్స్‌ ఇండియా పేరుతో దేశంలోనే మొదటి విమాన సర్వీస్‌ను జెడ్డా నుంచి హైదరాబాద్‌కు నడుపుతుండటంతో ఆనందం వ్యక్తంచేశారు. సౌదీ ఆరేబియాలో రాష్ట్రానికి చెందిన చాలా మంది పనులు చేసుకుంటున్నారని, వాళ్లు రావడానికి ఈ విమాన సర్వీసు బాగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, పలు పార్టీల నాయకులు హాజరయ్యారు.