128 ఏళ్ల తర్వాత 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్..
` అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ థామస్ బాచ్ ప్రటకన
న్యూఢల్లీి(జనంసాక్షి): క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిధిని క్రికెట్‌కు ఆమోదం తెలిపినట్లు శుక్రవారం ప్రకటన చేశారు. ముంబైలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటీ బోర్డు విూటింగ్‌లో పాల్గొన్న అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ విషయాన్ని తెలిపారు. ఒలింపిక్స్‌లో కొత్తగా అయిదు క్రీడలను చేర్చాలనుకున్నారని, దాంట్లో క్రికెట్ కూడా ఉందని, ఆ ప్రతిపాదనకు లాస్ ఏంజిల్స్ నిర్వాహకులు ఆమోదించినట్లు థామస్ బాచ్ పేర్కొన్నారు. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ క్రీడలను ఒలింపిక్స్‌లో ఆడిరచే ఛాన్సు ఉంది.