14న ఉచిత కంటి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 11 : శివశక్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 14న వినుకొండ పట్టణంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని పట్టణ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్ల సూచనల మేరకు కంటి ఆపరేషన్లు చేయాల్సిన వారిని పెదకాకాని కంటి వైద్య శాలకు తీసుకెళ్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అలాగే వినుకొండ నియోజకవర్గమైన శావల్యాపురం మండలంలో వైద్య పరీక్షలు చేసిన 268 మందిని కంటి ఆపరేషన్లు చేయించేందుకు ఈ నెల 14న శంకర కంటి వైద్యశాలకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. శావల్యాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.