ప్రజల ఆకాంక్షను కేంద్రం గుర్తించాలి

ఆదిలాబాద్‌, జూన్‌ 5  (ప్రజల కోరిక నెరవేర్చని పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 884వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని సందర్శించి వారు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేది తెచ్చేది మేమే అంటున్న కాంగ్రెస్‌, తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తామన్న టీడీపీలు తమ వైఖరిని మార్చుకోకపోతే తెలంగాణలో పుట్టగతులు ఉండవని వారు అన్నారు. రాష్ట్రం ఏర్పాటు విషయంలో కుంటిసాకులతో కేంద్ర కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షను గుర్తించి కేంద్రం స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.