భారత 15వ ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణం
అంగరంగ వైభవంగా వేదిక శ్రీదేశవ్యాప్తంగా శ్రేణుల సంబరాలు
ఈశ్వరుడిపై శపథం చేసిన మోడీ శ్రీప్రధాన ఆకర్షణగా సార్క్ ప్రతినిధులు
పాక్‌కు స్నేహహస్తం శ్రీనేడు నవాజ్ షరీఫ్‌తో భేటీ
46 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ, మే 26 (జనంసాక్షి) :
భారత 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దా మోదర్‌దాస్ మోడీ ప్రమాణ స్వీకారం చేశా రు. వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది భారతీయులు టీవీల ముందు కూ ర్చుని చూస్తుండగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వరునిపై శపథం చేశారు. రాష్ట్రపతి భవ న్ ప్రాంగణంలో అపూర్వ స్థాయిలో ఏర్పా టు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో మోడీ తమ పూర్తి పేరు చెబుతూ హిందీ భాషలో ప్రమాణం చేశారు. సార్క్ దేశాల ప్రతిని ధులు, పలువురు వీఐపీలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమ య్యింది. మోడీ హిందీలో భగవంతుడి సాక్షి గా ప్రమాణం
చేశారు. తెల్లని కుర్తా ధరించి వచ్చిన ఆయన భారత ప్రధానిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్ లోపలినుంచి వెలుపలకు వచ్చారు. ఆయన రెండు చేతులూ ఎత్తి అందరికీ నమస్కారం పెడుతూ తమ స్థానంలో ఆసీనులయ్యారు. రాష్ట్రపతికి ప్రతి నమస్కారం చేస్తూ ఆహూతులు గౌరవసూచకంగా లేని నిల్చున్నారు. అనంతరం ప్రధానిగా ప్రమాణం చేయవలసిందిగా రాష్ట్రపతి భవన్ అధికారినుంచి వచ్చిన సమాచారంతో నరేంద్రమోదీ లేచి వెళ్లి హిందీలో ప్రమాణం చేశారు. సంప్రదాయం ప్రకారం రెండు సార్లు ప్రమాణపత్రం చదివిన అనంతరం మోదీ చిరునవ్వుతో ముందుకు వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రణామం చేశారు. ప్రణబ్ ముఖర్జీ కూడా చిరునవ్వుతో ఆయనను పలుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వరుసగా హిందీలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత వెంకయ్యనాయుడు ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. తర్వాత నితిన్ గడ్కరి హిందీలో ప్రమాణం చేయగా సదానంద్ గౌడ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. వదోదరా, వారణాసిల నుంచి లోక్‌సభకు ఎన్నికైన మోడీ గతంలో ఏనాడూ లోక్‌సభకు పనిచేయలేదు. ఆయన తొలిసారి లోక్‌సభలో ప్రవేశించడమే ప్రధానిగా ప్రవేశంచబోతున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్రపతి భవన్ వెలుపుల ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మోడీ తరవాత లక్నో ఎంపీ రాజ్‌నాథ్‌సింగ్ మొదట ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన తర్వాత విదిషా ఎంపీ సుష్మాస్వరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా, నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన అరుణ్‌జైట్లీ రాజ్యసభ ఎంపీ. న్యాయశాఖ మంత్రిగా ఆయనకు అనుభవం ఉంది. గతంలో భాజపా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన నితిన్ గడ్కరీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, రాజ్యసభ ఉపసభాపతిగా పనిచేసిన నజ్మాహెప్తుల్లా, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి గోపీనాథ్ ముండే, గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన బీహార్ నేత రామ్‌విలాస్ పాశ్వాన్, యూపీకి చెందిన ఎంపీ కల్‌రాజ్ మిశ్రా నరేంద్రమోడీ మంత్రివర్గంలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధప్రదేశ్‌కి చెందిన భారతీయ జనతా పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు మోడీ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న వెంకయ్యనాయుడు గతంలో గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. మోడీ ప్రమాణ స్వీకారానికి భాజపా అగ్రనేతలు, సినీ ప్రముఖులు, పొరుగుదేశాల అధినేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభాప్రాంగణానికి చేరుకున్నారు. పరిచయాలు, ప్రణామాలతో ప్రాంగణమంతా సందడిగా మారింది. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు చిదంబరం తదితర కాంగ్రెస్ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. అద్వానీ, మురళీమనోహర్ జోషి తదితరులు కూడా ముందువరుసలో ఉన్నారు. సార్క్ దేశాధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఉదయం భారత దేశానికి ప్రధానమంత్రి కాబోయే నరేంద్రమోదీ ఢిల్లీలోని గాంధీ సమాధి, రాజ్‌ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ నేతలు హర్షవర్ధన్, విజయ్ గోయల్ తదితరులు వెంటరాగా మోదీ ఉదయం 8 గంటలకు రాజ్‌ఘాట్ చేరుకున్నారు. తెల్లని దుస్తులు ధరించిన మోదీ గాంధీ సమాధి చుట్టూ ప్రదర్శనలు చేశారు. సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం మోదీ రాజ్‌ఘాట్ ప్రాంగణంలోనే కొద్ది సేపు మౌనంగా చేతులు జోడించి కూర్చున్నారు. అక్కడి నుంచి మోదీ నేరుగా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నివాసానికి వెళ్ళారు. వాజ్‌పేయి ఆశీస్సులు తీసుకున్న తర్వాత నేరుగా గుజరాతీ భవన్‌కు వెళ్లిపోయారు. టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు ప్రమాణస్వీకారంలో కొద్దిగా తడబడ్డారు. ఆయన తన పేరు చదవకుండానే ప్రమాణ పత్రన్ని మొదలు పెట్టారు. అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ జోక్యం చేసుకుని పేరు చదవాలని సూచించారు. తెల్లటి కోటు ధరించి వచ్చిన ఆయన బీజేపీయేతర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, పలుశాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న అశోక్‌గజపతిరాజు నరేంద్రమోడీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఈ ఎన్నికల్లో తొలిసారిగా విజయనగరం నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అశోక్‌గజపతిరాజుకు పౌరవిమానయాన శాఖ కేటాయించనున్నట్లు సమాచారం.
కేబినెట్ మంత్రులుగా 24 మంది ప్రమాణం
ప్రధానిగా నరేంద్రమోడీతో పాటు 24 మంది కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండడం విశేషం. మన రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నారు. ఇందులో వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు మోడీ కేబినెట్లో స్థానం పొందారు. ఇక మహిళల్లో నజ్మా హెప్తుల్లా సీనియర్ కాగా స్మృతి ఇరానీ అతి పిన్న వయస్కురాలు. సానుకూలంగా ఉంటుందని భావించిన మోడీ..అటు మహిళలకు సముచిత స్థానం కల్పించారు. తాజా కేబినెట్ లో చోటు దక్కిన వారిలో సుష్మాస్వరాజ్, ఉమాభారతి, మేనకాగాంధీ, స్మృతి ఇరానీ, కిరణ్ ఖేర్, నజ్మా హెప్తుల్లా, నిర్మలా సీతారామన్‌లు ఉన్నారు. కేబినెట్‌లో చోటు దక్కిన నిర్మలా సీతారామన్ ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతుండగా, స్మృతి ఇరానీ మాత్రం తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మొత్తం మీద 46 మందికి చోటు దక్కింది. వారిలో 24 మందికి కేబినెట్ ¬దా, 12మందికి సహాయ మంత్రులు, 10మందికి స్వతంత్ర ¬దా కల్పించారు. ఇక రక్షణ శాఖను మోడీ తన ఆధ్వర్యంలోనే ఉంచుకోనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ దక్కనుంది. విదేశాంగమంత్రిగా సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ, ఆరోగ్య శాఖ మంత్రిగా హర్షవర్థన్కు చోటు లభించే అవకాశం ఉంది.
అరగంట ముందు సోనియా రాక
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సరిగ్గా అరగంట ముందు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమారుడు రాహుల్‌తో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వస్తూనే ఆమె అక్కడ కనిపించిన వారందరికీ నమస్కారం చేశారు. ఆమెను చూడగానే ఎల్‌కే అద్వానీ లేచి నిల్చుని ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. ఆమెను కుశలప్రశ్నలు కూడా వేశారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది మార్గం చూపించడంతో సోనియా ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. దారిలో కనిపించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రణామం చేస్తూ ఆమె ముందుకు కదిలారు. సోనియా రావడంతో అప్పటికే ఆసీనురాలైన మాజీ స్పీకర్ మీరా కుమార్ లేచి నిల్చున్నారు. ఇంకాస్త ముందుకు వెళ్లాక సోనియా, రాహుల్‌లను భద్రతా సిబ్బంది కూర్చోబెట్టారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ దంపతులు కూడా వచ్చి వారి పక్కన కూర్చున్నారు.
అతిథులను ఆప్యాయంగా పలకరించిన అద్వానీ
నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రముఖులను భాజపా అగ్రనేత అద్వానీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి స్వాగతం చెప్పారు. వివిధ దేశాల నేతలు, విఐపిలను అద్వానీ పలకిరంచారు. మన రాష్ట్రంనుంచి ఈ కార్యక్రమానికి తెదేపా, తెరాస అధినేతలు, రెండు రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లతో పాటు భాజపా నేత కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
భద్రతాదళాల గుప్పట్లో రాష్ట్రపతి భవన్
ప్రమాణ స్వీకారోత్సవాన్ని పుర్సకరించుకుని రాష్ట్రపతి భవన్ భద్రతా దళాల గుప్పిట్లోకి వెళ్లింది. ఇక్కడ భారత నూతన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవనం చుట్టూపక్కల సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వైమానిక సిబ్బందితో పాటు ఆరు వేల మంది పార్లమెంట్ కమాండోలు, పోలీసు షార్ప్ షూటర్లు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గం.లకు మోడీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని అత్యంత కట్టుదిట్టుమైన భద్రత మధ్య ఉండే రాష్ట్రపతి భవన్‌ను మరింత పటిష్ట రక్షణ ఏర్పాట్లతో దుర్భేద్యంగా మారుస్తున్నారు. కార్యక్రమానికి మూడు వేలమంది అతిథులు హాజరుకా నున్నారు. తొలిసారిగా సార్క్ దేశాల అధినేతలు కూడా రేపటి వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఏడువేల సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించనున్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు చేపట్టే భద్రతా ఏర్పాట్లకు సరిసమాన స్థాయిలో ఇటు భూమి అటు గగనతలాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోడీ పాక్‌కు స్నేహహస్తాన్ని అందించారు. ఆయన ప్రమాణ స్వీకారం కోసం సోమవారం న్యూఢిల్లీకి చేరకున్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మంగళవారం కూడా భారత్‌లోనే పర్యటిస్తారు. ఆయనతో మోడీ ప్రత్యేకంగా భేటీ అయి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్యలపై చర్చిస్తారు. నవాజ్ షరీఫ్ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతోనూ భేటీ కానున్నారు.
మోడీ మంత్రివర్గ సభ్యులు :
రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు. నితిన్ గడ్కరీ, సదానందగౌడ, ఉమాభారతి, నజ్మాహెప్తుల్లా, గోపీనాథ్‌ముండే, రామ్ విలాస్ పాశ్వాన్, కల్‌రాజ్ మిశ్రా, మేనకాగాంధీ, అనంతకుమార్, రవిశంకర్ ప్రసాద్, అశోక్ గజపతిరాజు, అనంత్‌గీతే, హర్మిత్‌కౌర్, నరేంద్రసింగ్ తోమర్, జ్యూల్ ఓరమ్, రాధామోహన్‌సింగ్, తవర్‌చంద్ గెహ్లాట్, స్మృతి ఇరానీ, డాక్టర్ హర్షవర్ధన్, సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) : జనరత్ వీకే సింగ్, రావ్ ఇంద్రజిత్, సంతోష్ గ్యాంగ్‌వర్, శ్రీపాద్ నాయక్, ధర్మేంద్ర ప్రధాన్, శర్వానంద్ సోనోవాల్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ జయప్రకాశ్ గోయల్, డాక్టర్ జితేంద్రసింగ్, నిర్మాలా సీతారామన్, మలికార్జునప్ప సిద్దేశ్వర, మనోజ్‌సిన్హా, సహాయ మంత్రులు : నిహాల్‌చంద్, సీపీ రాధాకృష్ణన్, క్రిషర్‌పాల్‌గుజర్, సంజీవ్‌కుమార్ బాలియా, వాసవ మున్సుక్ భాయ్ ధనాజీభాయ్, రావు సాహెబ్ దాదారావ్ పటేల్, సుదర్శన్ భగత్, ఉపేంద్ర కుష్వాహా, విష్ణుదేవ్ సాయి, కిరణ్ రిజిజు. మంగళవారం ఉదయానికల్లా మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. మోడీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఎవరికీ ప్రాతినిథ్యం దక్కలేదు. ఆ పార్టీ సీనియర్ నేత దత్తాత్రేయ చోటు ఆశించినా నిరాశే మిగిలింది. అలాగే పార్టీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, అరుణ్‌శౌరీలకు చోటు కల్పించలేదు. 75 ఏళ్లు దాటిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అయితే వీరి సేవలను ఇతర రూపాల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం.