16వతేది లోగా గురుకుల సెట్ కుదరఖాస్తు చేసుకోండి
జుక్కల్, మార్చి 14, (జనంసాక్షి),
సాంఘీక సంక్షేమ గురుకుల పాఠాలల్లో 2023-2 4విద్యా సంవత్సరానికి 5వతరగతి సీట్ల భర్తీకి ప్రవేశ ప్రకటన వెలువడిందని కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ సాంఘీక సంక్షేమ గురుకులపాఠశాల ప్రిన్సిపాల్ టి.నళిని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4వతరగతి చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులని తెలిపారు. మార్చి 16వతేదిలోగా 100 రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు. అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఎప్రిల్ 23న నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు వెబ్సైట్ www.VTG సెట్ ను సందర్శించాలని తెలిపారు.