16న జరిగే ధర్నాను జయప్రదం చేయండి
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు
మునగాల, సెప్టెంబర్ 7(జనంసాక్షి): ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాలను స్థానిక సమస్యలపై సర్వే చేసి వాటి పరిష్కారం కొరకు ఈ నెల 16న తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహిస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు అన్నారు. బుధవారం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం ఎస్ కె సైదా అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇండ్ల స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షలు ఇవ్వాలని, 57సం., నిండి ఉన్న అర్హులైన వారందరికీ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని, ధరణిలో లోపాలను సవరించాలని, రైతులకు రుణ మాఫీ చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైన ఈనెల 16న తహశీల్దార్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవవరం వెంకట్ రెడ్డి, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, జె కొండారెడ్డి, డి స్టాలిన్ రెడ్డి, బి మంగయ్య, బి కృష్ణారెడ్డి, బి నాగయ్య, టి సతీష్, ఎస్ పిచ్చయ్యలు పాల్గొన్నారు.