16 ఎంపి సీట్లు మనవే కావాలి: జూపల్లి

నాగర్‌కర్నూల్‌,మార్చి26(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములుకు భారీ మెజార్టీ అందించి, గెలిపించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. రాముఉల సౌమ్యుడని అన్నారు. కెసిఆర్‌ నాయకత్వంలో ఢిల్లీలో మన వాణి వినిపించాలంటే 16 ఎంపి సీట్లు మనమే గెలవాలని అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన వివిధ గ్రామాల్లోపర్యటించి ప్రజలను కలిసారు.  ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ ఏళ్ల తరబడి కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తు న్న కాంగ్రెస్‌, బీజేపీలకతీతంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వాన థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటుకు మన వంతు సహకారం అందించాలని కోరారు. కేంద్రంలో మన వంతు పాత్ర ఉన్నప్పుడే పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు జాతీయ ¬దా కల్పించుకునే హక్కు మనకు ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా.., పదవి లేకపోయినా.., ప్రజాతీర్పును గౌరవిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో కొల్లాపూర్‌ ప్రాంత అభివృద్ధికి నిరంతరం సైనికుడిలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

తాజావార్తలు