17న హరిధాన్ 4 కె రన్
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు హరిథాన్ పేరిట పరుగును నిర్వహించనున్నట్లు ప్లానెట్ త్రీ ప్రొటెక్షన్ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో వచ్చే నలె 17వ తేదీన ఈ పరుగును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 5. కి,మీల మేర సాగే ఈ పరుగులో మొదటి వచ్చిన ముగ్గురిని ప్రత్యేక బహుమతులతో సత్కరించనున్నట్లు వారు తెలిపారు. హరితాన్ పరుగులో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలతో ప్రదర్శినను ఏర్పాటు చేసినట్లు ప్లానెట్ త్రీ ప్రొటెక్షన్ సంస్థ వివరించింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఆధునిక సమాజం ఇబ్బందుల్లోకి పడిపోతోందని జెఎన్‌టీయూ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఈ అవగాహన పరుగు నిర్వహణలో సహాయం చేయడానికి కాలుష్య నియంత్రణ మండలితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.