17న ఆహార సలహా సంఘ సమావేశం
విజయనగరం, జూలై 11 : ఈ నెల 17న స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఆహార సలహా సంఘ సమావేశం జరుగుతుందని జిల్లా పౌరసరఫరా అధికారి శాంతిరాజు బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశానికి సలహా సంఘ సభ్యులంతా హాజరు కావాలని ఆయన కోరారు.