18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా: భూపాలపల్లి ప్రతి నిధి సెప్టెంబర్ 3 జనం సాక్షి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ శనివారం జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ భావిష్ మిశ్రా సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు . ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు నేటి నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నేరుగా సంబంధిత మండలాల గ్రామాలలో గల బిఎల్ఓ ల వద్దకు ఆధార్ కార్డు జిరాక్స్ ,మెమో జిరాక్స్, కలర్ ఫోటోతో వెళ్లి ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి భావిష్ మిశ్రా తెలిపారు. ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.