19 మందితో చంద్రబాబు నాయుడు కేబినెట్

ఇద్దరు బీజేపీ అభ్యర్థులకు

ముగ్గురు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం

 హైదరాబాద్, జూన్ 8 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేబినెట్ జాబితా సిద్ధమైంది. మొత్తం 19 మందితో కూడిన కేబినెట్ జాబితాను ఆదివారం గవర్నర్‌కు అందజేశారు. కేబినెట్‌లో ఇద్దరు బీజేపీ అభ్యర్థులకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అలాగే ముగ్గురు మహిళలకు కేబినెట్‌లో చోటు లభించింది. ఈ రోజు సాయంత్రం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కేబినెట్‌లో దాదాపు అన్ని వర్గాల వారికి చంద్రబాబు అవకాశం కల్పించారు. బీసీ-6, కమ్మ – 4,కాపు -3 , రెడ్డి- 2, ఎస్సీ-2 వైశ్య-ఒకరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీకి కేటాయించిన సీట్లలో కాపు-1, కమ్మ-1 ఉన్నారు. అరుతే కేబినెట్‌లో మైనర్టీ, ఎస్సీ వర్గాలకు చోటు లభించ లేదు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడుగురు సభ్యులకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించింది. విస్తరణలో మరో ఆరుగురికి స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు మంత్రివర్గం :
* శ్రీకాకుళం : అచ్చెన్నాయుడు
* విజయనగరం : కి మిడి మృణాళిని
* విశాఖపట్నం : అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్‌రావు
* తూగో : యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప
* పగో : పీతల సుజాత
* కృష్ణా : దేవినేని ఉమా, కొల్లు రవీంద్రబాబు
* గుంటూరు : ప్రతిపాటి పుల్లారావు, రావెల్ల కిషోర్
* ప్రకాశం : సిద్దా రాఘవరావు
* నెల్లూరు : నారాయణ
* చిత్తూరు : బొజ్జ గోపాలకృష్ణారెడ్డి
* కర్నూలు : కేఈ కృష్ణమూర్తి
* అనంతపురం : పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత
బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావుకు మంత్రులుగా స్థానం లభించింది.