2జి కుంభకోణం – మీడియా ద్రోహం

ప్రజలకు వంద రూపాయల మేలు చేయాలంటే వంద కమిటీలు వేసే ప్రభుత్వాలు, తాము చేసే లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల విషయంలో ఎలా వ్యవహరిస్తాయో వివరిస్తున్నారు కెవి కూర్మనాధ్‌
ఫిబ్రవరి మొదటివారంలో సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులనురద్దు చేసింది. ఇవి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సెల్‌ఫోన్‌ సర్వీసులను ప్రారంభించడానికి కేంద్రం ఇచ్చిన అనుమ తులు. ఈ తాజా కుంభకోణం వల్ల దేశానికి కలిగిన నష్టం రెండు లక్షల కోట్ల రూపాయలు. నష్టం కలిగించిందెవరూ అంటే – స్వ యానా టెలికాం మంత్రి, ఆయనొక్కడేనా? అని నమ్మమంటోంది ప్రభుత్వం. మన దేశంలో ప్రభుత్వాలు, మంత్రివర్గాలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తున్న మనకు ఎవరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోగలరో చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రులూ, దేశానికైతే ప్రధాన మంత్రి (ఇంకా సూపర్‌ ప్రధాన మంత్రి అయిన సోనియాగాంధీ, ‘యువరాజు’ రాహుల్‌ గాంధీ, చిదంబరం)- వీళ్లు అనుకున్నది కాకుండా మరొకటి జరుగుతుందని ఎలా నమ్ముతాం?
విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌ల లాంటి చిన్న విషయాలపై గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ని ఏర్పాటు చేసి, నాన్చే ప్రభుత్వాలు రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే అనుమతుల్ని ఏ ఒక్క మంత్రి నిర్ణయానికో వదుల్తుందని ఎలా అనుకుంటాం? ఇప్పటికేఈ కుంభకోణం గురించి ఎన్నో వ్యాసాలు వచ్చి ఉన్నాయి కనుక రెండు మూడు అంశాలను చూద్దాం. మొదటిది, ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం, మీడియా మధ్యతరగతి ఇంకా ఈ వ్యవస్థకి అనధికార ప్రతినిధులుగా వ్యవహరించే మేధావులు ఎలా చూస్తున్నారనేది ఎవరో ఒకరిద్దరు తప్పు చేసి ఉండొచ్చు. కానీ ఇలా ఇన్ని లైసెన్సు లను రద్దుచేస్తే ఎట్లా? కంసెనీ ప్రతినిధుల్ని అరెస్టు చేస్తే ఎలా? విదేశీ పెట్టుబడులు ఆగిపోతయి ఇట్లాంటి నిర్ణయాల వల్ల…. అని ప్రభుత్వం అంటుంది. జాతీయ పత్రికల్లో అధికబాగం, జాతీయ చానెళ్లు ఈ అభిప్రాయాన్ని ప్రచారం చేస్తూ ఉంటాయి. మంత్రినీ, కంపెనీ ప్రతినిధుల్ని జైల్లో పెట్టిన రోజున చాలా పత్రికాఫీసుల్లో ఒకరకమైన విషాద వాతావరణం ఉందంటే ఆశ్చర్యం లేదు. విధాన నిర్ణయాల్లో భాగంగా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. దానికి మంత్రుల్ని బాద్యుల్ని చేస్తే ఎలా? వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఆ శాఖ మంత్రితో, అధికారులతో కంపెనీల ప్రతినిధులు మాట్లాడడం సహజం. అందుకు అరెస్టు చేస్తే ఎలా? అనుమతుల్ని రద్దు చేస్తే ఎలా? భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారు మన గురించి ఏమనుకుంటారో అన్న వాదనలు చేస్తున్నారు. ఇక్కడి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నదేమిటంటే, ప్రజాస్వామ్యం పేరుతో, స్వేచ్చా వాణిజ్యం పేరుతో, అభివృద్ది పేరుతో ప్రభుత్వం, పెట్టుబడి, వీటి సమర్తకులుగా ఉండే మధ్యతరగతి మేధావులూ ఎలా చేతులు కలుపుతారో రెడు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బహిరంగంగా దోచుకుంటే రాజద్రోహమనీ, జాతికి శత్రువులనీ, ఏరి వేయాలని అనరెందుకో, అనకపోవడమే కాకుం డా సకల మర్యాదరలతో సౌకర్యాలతో జైళ్లలో వసతులు కల్సిస్తారు.
ఈ రెండు లక్షల కోట్లలో ఒకలక్ష కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకులవి. అంటే ఈ 122 లైసెన్సులు రద్దయాయి. కాబట్టి ఈ లైసెన్సుల కోసం ఆయా కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన ఈ రుణాలన్నీ మొండి బకాయిలు కానున్నాయి. అసలే ఆర్థిక మాంద్యం వల్ల నీరసపడి ఉన్న బ్యాంకులు ఇంత నష్టాన్ని భరించే పరిస్థితిలో ఉన్నాయా? ఈ అంశం మీద సరిగా సమాచారం లేనివారి కోసం కొంచెం వివరణ. 2జి అంటే సెకెండ్‌ జనరేషన్‌ లేదా రెండోతరం టెలికాం సేవలు. ల్యాండ్‌లైన్‌ ఫోన్లు (అంటే వైర్లతో నడిచే) మొదటి తరానికి చెందినవి. కేవలం మాట్లాడుకునే అవకాశం ఉండేది. రెండోతరంలో మాట్లాడుకోవడంతో పాటు డేటా(ఎస్‌ఎంఎస్‌లు, ఇంటర్నెట్‌) కూడా బట్వాడా చేసుకోవచ్చు. మూడోతరం, నాలుగోత రం టెలికాం సర్విసులు కూడా రాబోతున్నాయి. కానీ ప్రస్తుతం మనచర్చ 2జి గురించి కాబట్టి దీనికే పరిమితమవుదాం. ఈ సర్వీసులు అందుబాటులోకి రావడానికి గాలిలో మనకి కనిపి ంచకుండా ఉండే విద్యుదయస్కాంత తరంగాలు కారణం. ఇవి దేశ భూబాగం మీద విస్తరించి ఉంటాయి కాబట్టి , అన్ని సహజ వనరుల్లాగానే ప్రజల ఆస్తిగానే పరిగణిస్తారు ప్రపంచ వ్యాప్తంగా, అందుకే టెలికాం కంపెనీలు వీటిని వాడుకొని వ్యాపారాలు చేస్తాయి. కాబట్టి దేవాల న్నీ వాటిని అమ్ముతాయి. లేదా వేలం వేసి అ మ్యుతాయి. అన్ని వనరుల మీద ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనుకొనే పెట్టుబడిదార్లు ఈ వన రుని కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు. భూముల్ని మింగేసి, ఆదివాసుల భూముల కింద వనరుల్ని ఆక్రమించుకున్న పెట్టుబడి, సా మ్రాజ్యవాదం ఈ కనిపించని వనరుల మీద కూడా దృష్టి పెట్టిందని చూపించడానికి ఇది మ రో ఉదాహరణ.
ఈ 122 లైసెన్సుల సంగతే చూడండి.ఇందులో 90 శాతం లైసెన్సులు స్థానిక పెట్టుబడిదారులు వేలంలో కొనుక్కున్నవి. వ్యాపారం చెయ్యడానికి కాదు. కొని పెట్టుకుంటే (భూమి విషయంలో వలె) ఎవరైనా ఎప్పుడైనా వచ్చి లైసెన్సు కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి వాటాలు కొనుక్కుంటారని, అందుకే టెలికాం వ్యాపారంతో సంబంధం లేని, ఆ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని ఎంతోమంది వేలంలో పాల్గొని 2జి స్పెక్ట్రమ్‌ కొనుక్కున్నారు. వాళ్ల దగ్గర ఉన్న డబ్బుతో కాదు. ఈ స్పెక్ట్రమ్‌ పూచిగా, హామీగా చూపించి ప్రభుత్వ బ్యాంకుల నుండి అప్పు తీసుకొని కొన్నారు. లైసెన్సులు, ఒప్పందాలు, రద్దయితే ఎవరికి నష్టం? దూరదృష్టితో లైసెన్సులు కొంటున్నారు కాబట్టి, ఆ కొనడానికి కూడా ప్రభుత్వమే సహాయం చేస్తుంది. కాబట్టి, వ్యాపారం చేసే ఉద్దేశం లేదని తెలిసి కూడా ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని నడిపేవారు. ఈ దందాలో వాటా కోరారు. అందు కోసమే వేలం నిబంధనల్ని ప్రభుత్వానికి లాభం వచ్చేటట్టు కాకుం డా కొనుక్కున్న వాళ్లకి ప్రమోజనం కలిగేలా చేశారు. దీనికి సూత్రదారులు సోనియా, మన్మోహన్‌ నేతృత్వంలో చిదంబరం, ప్రణబ్‌ ముఖర్జీ. రాజాలు. కంపెనీలకు, అధికారులకు, ప్రభుత్వా నేతలకు మధ్య బ్రోకర్లుగా వ్యవహరించింది మీడియా. పబ్లిక్‌ రిలేషన్‌ కంపెనీలు, తమకు అనుకూలంగా నిర్ణయాలను తెప్పించుకోవడానికి ఎవరెవరికి ఏయే స్థానాల్లో నియమించాలో కంపెనీలే నిర్ణయించాయని సాక్ష్యాధారాలు బయటపడ్డాయి. బయలకొచ్చిన రహస్య టెలిఫోన్‌ సంభాషణల్లో నడిచిన స్క్రిప్ట్‌ ప్రకారమే అంతా జరిగిరది. కానీ ఎవ్వరికీ ఏమీ కాఏదు. తన పబ్లిక్‌ రిలేషన్స్‌ కంపెనీ ద్వారా వ్యవహారం నడిపించిన టాటా మర్యాదస్తుడే ప్రభుత్వం వైపు నుంచి పని నడిపించిన చిదంబరం, ఆయనకి వెన్నుదన్నుగా నిలిచిన సోనియా మన్మోహన్‌ సింగ్‌లు కూడా అమాయకులే.
ప్రజాస్వామ్యంలో ప్రధాన స్తంభాలు నాల్గింటిలో మూడు కుంభకోణంలో పాటు పంచుకున్నాయి. కాబట్టి దీనిపై కాలవసినంత రాద్ధాంతం జరగలేదు. ఏదో కోర్టు అడ్డుచెప్పబట్టి కనీసం ఇంతవరకు వచ్చింది. కానీ లేకపోతే ఈ మాత్రం కూడా జరిగి ఉండేది కాదు. వందో రెండొందలో తీసుకుని ఎవరైనా చిరుద్యోగి పట్టుబడితే అవినీతి, అవినీతి అని వీరంగం చేసే మధ్యతరగతి మీడియా రెండు లక్షల కోట్ల రూపాయలవిషయంలో ఎంత గొడవ చెయ్యాలి? మధ్యతరగతి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే జాతీయ మీడియా చిత్రంగా దొంగల్నే, అవినీతిని పెంచి పోషించిన ప్రైవేట్‌ రంగాన్నే సపోర్ట్‌ చేస్తోంది. వాళ్ల తప్పుల్నీ ఎండగట్టకుండా, బ్యాంకులకు రావాల్సిన లక్ష కోట్ల గురించి మాట్లాడకుండా, పెట్టుబడి వాతావరణం పాడైపోతోందని గగ్గోలు పెడుతోంది.మొన్న ఎన్రాన్‌ విషయంలోనూ ఇదే జరిగింది. (చిత్రంగా అప్పుడు ఇప్పుడు చిదంబరమే ప్రధాన మంత్రి) బెంగాల్‌లో టాటాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తే మీడియా రైతుల్నే తప్పు పట్టింది. టాటా గారు ఏదో ఉద్దరిద్దామని వస్తే ఇలా చేస్తారేంటని ప్రజల్నే తప్పు పట్టింది. అప్పుడూ, ఇప్పుడూ కూడా టాటానే తప్పు చేసి ఏరం ప్రజల మీదికి తోసే ప్రయత్నం చేస్తున్నారు.
– వీక్షణం సౌజన్యంతో…