20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 16 : ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ వెలువడనుంది. 27వ తేదీన సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. 29 నుంచి వెబ్‌ ఆక్షన్స్‌ నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్‌ 12 నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుంది. సెప్టెంబర్‌ 17 నుండి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలపై కొరడ ఝళిపించేందుకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కాలేజీల తనిఖీ అనంతరమే ఫీజులు నిర్ణయించాలని సబ్‌ కమిటీ నిర్ణయించింది. సబ్‌ కమిటీ నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు కొన్ని కాలేజీల యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారంనాడు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్స్‌ ఒక ప్రకటన చేసింది. సబ్‌ కమిటీ నిర్ణయం మేరకు ఎఎఎఫ్‌ఆర్‌టి కొత్త నిబంధనలు రూపొందించిందని, దాని ప్రకారం అంతా అండర్‌టేకింగ్‌ ఇవ్వాలిందేనని పేర్కొంది. 16 కాలేజీలు మినహా ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీలు అండర్‌టేకింగ్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని అసోసియేషన్‌ పేర్కొంది.

20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌