20న మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం

ఖమ్మం, జనవరి 19 : ఈ నెల 20వ తేదీన ఉదయం పది గంటలకు ఖమ్మంలోని టిఐసియు జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కన్వీనర్‌ కుమారి తెలిపారు. కార్మికులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని, విజయవంతం చేయాలని ఆమె కోరారు.