20వేల కోట్లతో సోలార్‌ లైట్‌ స్కీమ్‌


పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం
బీహార్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీహార్‌ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల్లో బీహార్‌ పంజాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. 20వేల కోట్లతో సోలార్‌ లైట్‌ స్కీమ్‌ ని నితీష్‌ సర్కార్‌ ప్రకటించింది. 143 అర్బన్‌ ప్రాంతాల్లో మరియు 8,300కి పైగా ప్రతీ పంచాయతీలో 10 సోలార్‌ లైట్లు చొప్పున ఏర్పాటు కోసం టెండర్లను ఆహ్వానించింది బీహార్‌ ప్రభుత్వం. కాగా, పార్టీ కేడర్‌ ని నిర్మించుకునేందుకు 2006 నుంచి పంచాయతీ ఎన్నికలపై జేడీయూ ప్రధానంగా దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. అయితే, ముఖియాలు(గ్రామ హెడ్‌ లు) మరియు ఇతర పంచాయితీ-స్థాయి ప్రతినిధులపై అవినీతి ఆరోపణలతో గతంలో ప్రవేశపెట్టిన సోలార్‌ లైట్‌ స్కీమ్‌ దెబ్బతిన్న నేపథ్యంలో..ప్రస్తుతం నితీష్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష ఆర్జేడీ ప్రశ్నిస్తోంది. ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి సుబోధ్‌ కుమార్‌ మాట్లాడుతూ%ౌౌ% పార్టీ విధానంలో పంచాయితీ ఎన్నికలు జరగకున్నప్పటికీ ప్రతి పంచాయతీలో సోలార్‌ లైట్లను ఏర్పాటు చేయడానికి సాంకేతిక బిడ్డింగ్‌ను ఆహ్వానించడానికి ఇది కరెక్ట్‌ సమయం కాదు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇది ఒక మార్గం. అన్ని రాజకీయ పార్టీలు తమ క్షేత్రస్థాయి మద్దతును బలోపేతం చేసుకోవడానికి పంచాయితీ ఎన్నికల్లో పరోక్షంగా అభ్యర్థుల వెనుక నిలబడతాయి. ఈ సోలార్‌ పథకం అవినీతికి దారితీస్తుంది. ఈ పథకంకి సంబంధించి ప్రభుత్వం ఆహ్వానించిన బిడ్డింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని మేము భారత ఎన్నికల సంఘంకి లేఖ రాస్తున్నాం అని సుబోధ్‌ కుమార్‌ తెలిపారు. అయితే,బీహార్‌ పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి సామ్రాట్‌ చౌదరి మాట్లాడుతూ%ౌౌ% గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతమున్న 12 వాట్ల లైట్‌ సరిగా లేదు, వీధులను ప్రకాశవంతం చేయడానికి 20 వాట్ల లైట్‌ ఏర్పాటు చేయబడుతుంది. ఇది కొనసాగుతున్న పథకం అని తెలిపారు. కాగా,సోలార్‌ లైట్లు ఏర్పాట్లు కోసం బిడ్డింగ్‌ లను ఆహ్వానించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఈ ఏడాది జూన్‌ లో బీహార్‌ పంచాయితీరాజ్‌ డిపార్ట్మెంట్‌ కోరింది.