20 న జరిగే పాఠశాలల, కళాశాలల బంద్ జయప్రదం చేయండి

పిడిఎస్ యు, ఎస్ఎఫ్ఐ నాయకుల పిలుపు
– బందుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించిన నాయకులు

 

మక్తల్, జులై 19, (జనం సాక్షి)

ప్రభుత్వ విద్యాసంస్థలలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20 న వామపక్ష విద్యార్థి సంఘాలు అధ్వర్యంలో ఇచ్చిన పాఠశాలల,కళాశాలల బంద్ చేయాలని ఆ సంఘం ఉపాధ్యక్షులు భాస్కర్ పిలుపునిచ్చారు. మక్తల్ పట్టణంలో బందుకు సంబంధించిన గోడ పత్రికను కార్యకర్తలు కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా pdsu రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థలలోని సమస్యలు పరిష్కరించాలని అన్నారు. విద్యార్ధి వ్యతిరేఖ నూతన జాతీయ విద్యా విధానం ను ఎన్ ఈ పి -2020 ను రద్దు చేయాలి. విద్యార్థులందరికీ ఉచితంగా బస్ పాసులను అందించాలని,ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి,ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.
ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజులను నియంత్రించాలని,ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించాలి,పెండింగ్ లో ఉన్నా స్కాలర్ షిప్,ఫీజు రీయింబర్స్ మెంటును వెంటనే విడుదల చేయాలని అని అన్నారు.
ఈ నెల 20 న ఇచ్చిన విద్యాసంస్థల బంద్ ను జయప్రధం చేయుటకు విద్యార్థులు,యాజమాన్యాలు,సహకరించి విజయవంతం చేయాలని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీడిఎస్ యు జిల్లా కార్యదర్శి అజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపధ్యక్షుడు నర్సింహ, పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి బాలు,నాయకులు నయ్యుం,హరి తద్ధితారులు పాల్గోన్నారు.