2014లో కాంగ్రెస్‌, బీజేపీయేతర అభ్యర్థే ప్రధాని

అధ్వాని సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌్‌, భాజపాయేతరుడే ప్రధాన మంత్రిగా అయ్యే అవకాశాలున్నాయని భారతీయ జనతా పార్టీ సీనయర్‌ నేత ఎల్‌కె అధ్వానీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ మేరకు తన సోషల్‌ నెట్‌ వర్క్‌ బ్లాగులో ఆయన ఈ బాంబు పేల్చారు. దీనికి గతాన్ని కూడా ఆయన ఉదహరించారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీ లేదా కాంగ్రెస్‌ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కావచ్చన్నారు. గతంలో కూడా ఈ విధంగా జరిగాయన్నారు. ప్రధానమంత్రిగా సీహెచ్‌ చరణ్‌సింగ్‌, చంద్రశేఖర్‌, దేవెగౌడ, గుజ్రాల్‌లకు కాంగ్రెన మద్దతు ఇవ్వగా వీపీ సింగ్‌కు బీజేపీ మద్దతిచ్చిందని గుర్తుచేశారు. దీనిపై రాజకీయ వర్గాల్లో పలు వాదనలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ప్రధాని అభ్యర్దిత్వానికై ప్రయత్నిస్తున్న మోడీకి చెక్‌ పెట్టేందుకే అధ్వానీ ఈ సంచలన వ్యాఖ్యలు చేసాడన్న వాదనలు వినబడుతున్నాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరచడానికే ముఖ్యంగా గత కొంత కాలంగా మోడీ అభ్యర్దిత్వానికి వ్యతిరేకంగా ఉన్న బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను సంతృప్తి పరచడానికే ఈ వ్యాఖ్యలు చేసాడని అంచనా వేస్తున్నారు. కాగా బీజేపీ ఓటమికి అధ్వానీ సంకేతాలు ఇచ్చారనీ కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.